519th ANNAMAIAH VARDHANTI FETE FROM MARCH 28 – APRIL 1 మార్చి 12వ తేది నుంచి 18వ తేది వరకు శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 507వ వర్ధంతి ఉత్సవాలు

మార్చి 12వ తేది నుంచి 18వ తేది వరకు శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 507వ వర్ధంతి ఉత్సవాలు

 తిరుపతి, 2010 మార్చి 01: శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తాగ్రేశ్వరుడైౖన శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 507వ వర్ధంతి ఉత్సవాలను మార్చి 12వ తేది నుంచి 18వ తేది వరకు 7 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.

అన్నమయ్య 507వ వర్ధంతి ఉత్సవాలను తిరుమల, తిరుపతిలలోనే కాకుండా తిరుచానూరు, దేవుని కడప, అన్నమయ్య స్వగ్రామమైన తాళ్ళపాకలో కూడా నిర్వహించనున్నారు.

అదేవిధంగా అన్నమయ్య వర్థంతి రోజైన మార్చి 12వ తేదిన తిరుమల మాఢవీధులలో శ్రీవారు ఉభయదేవేరులతో కలసి ఊరేగుతారు. ఈ సందర్భంగా ఘనంగా నగర సంకీర్తన జరుగుతుంది.
7 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో తిరుమల, తిరుపతి, తిరుచానూరు, దేవునికడప, తాళ్ళపాక తదితర ప్రాంతాలలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి 507వ వర్థంతి సందర్భంగా ప్రతిరోజు ఈక్రింది కార్యక్రమాలు నిర్వహించబడును.

తేది: ప్రదేశము
11-03-2010 అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం
12-03-2010 ఉదయం తిరుమల నారాయణగిరి ఉధ్యానవనంలో, సాయంత్రం తిరుమల ఆస్థానమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు.
12-03-2010 నుండి
18-03-2010 వరకు తిరుపతి మహతి ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు.

12-03-2010 నుండి సాయంత్రం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో
18-03-2010 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు.

12-03-2010 నుండి సాయంత్రం తిరుపతి శ్రీనివాసం మరియు మాధవం గెస్ట్‌హౌస్‌లలో  
18-03-2010 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు.

12-03-2010 నుండి సాయంత్రం తిరుచానూరు ఆస్థానమండపంలో
14-03-2010 వరకు  సాంస్కృతిక కార్యక్రమాలు.

12-03-2010 నుండి తాళ్ళపాక ధ్యానమందిరంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం
18-03-2010 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు.

12-03-2010 నుండి సాయంత్రం తాళ్ళపాకలోని అన్నమయ్య 108 అడుగుల విగ్రహం
18-03-2010 వరకు వద్ద హరికథ కార్యక్రమాలు.

16-03-2010 నుండి
18-03-2010 వరకు సాయంత్రం దేవునికడపలో సాంస్కృతిక కార్యక్రమాలు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.