76TH DEATH ANNIVERSARY OF VETURI PRABHAKARA SASTRY ON AUGUST 29_ ఆగస్టు 29న శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 76వ వర్ధంతి

Tirupati, August 28, 2026: The 76th death anniversary of Sri Veturi Prabhakara Sastry, who brought the valuable literary works of Tallapaka Annamacharya to light, will be observed in Tirupati on August 29.

TTD officials will pay floral tributes to his bronze statue in front of SVETA Bhavan at 9 am. A literary seminar on his services will be held at Annamacharya Kala Mandir at 10.30 am.

Veturi Prabhakara Sastry played a key role in bringing Annamayya’s devotional literature, which remained unnoticed for nearly 400 years, to the public. His contribution to Telugu devotional literature remains memorable.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ఆగస్టు 29 శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 76 వర్ధంతి

అన్నమయ్య సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన మహనీయునికి ఘన నివాళి

తిరుపతి, 2026 ఆగస్టు 28: అన్నమయ్య సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మహనీయుడు శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 76వ వర్ధంతి కార్యక్రమం ఆగస్టు 29వ తేదీన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్వేత భవనం ఎదుట ఉన్న శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పిస్తారు.

అనంతరం ఉదయం 10.30 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి సాహితీ సేవలపై సాహితీ సదస్సు నిర్వహించనున్నారు.

శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి సుమారు 400 సంవత్సరాల పాటు మరుగున పడిన తాళ్లపాక అన్నమయ్య అమూల్య సాహిత్య సంపదను వెలికితీసి, భక్తి సాహిత్య ప్రపంచానికి అందించిన మహనీయుడు. ఆయన చేసిన అపారమైన సాహితీ సేవలు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

ఆయన వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అన్నమయ్య సాహిత్య పరిరక్షణకు, ప్రచారానికి శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి చేసిన మహోన్నత సేవలను స్మరించుకోనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.