A GRAND GALA OF COLOURFUL PERFORMANCES ALL THE WAY _ చంద్ర‌ప్ర‌భ వాహనసేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌A

TIRUMALA, 21 OCTOBER 2023: The Seventh Day evening witnessed a grand gala of colourful and unique performances by the various artists hailing from different states across the country, who presented their skills in front of the Chandraprabha Vahana Seva.

In Totto, 441 artists from 15 troupes presented a wide range of varied art forms including Light Dance, Kautam folk dance, traditional Drum beats, Kathak, Kolatam, Veerghese dance, Radhakrishna Rupakam, Sampurna Sundarakanda presented with a style which attracted the devotees waiting in the galleries of the four mada streets.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

చంద్ర‌ప్ర‌భ వాహనసేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుమల, 2023 అక్టోబరు 21: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడ‌వ‌ రోజైన శ‌నివారం రాత్రి చంద్ర‌ప్ర‌భ‌ వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 15 కళాబృందాలు, 441 మంది కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు..

తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే కౌతమ్ అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వి‌.నాగలక్ష్మి బృందం డ్రమ్స్ విన్యాసాలతో, మరో బృందం శ్రీమణి ఆధ్వర్యంలో డంబుల్ నృత్యంతోను అలరించారు. బెంగుళూరుకు చెందిన ఇందు. బృందం గోవింద గోవింద యని కొలువరే అనే నృత్య ప్రదర్శన, శివాణి జోషి ఆధ్వర్యంలో దీపనృత్యాలతో కనువిందు చేశారు.

మహారాష్ట్ర ముంబైకి చెందిన డాక్టర్ అనురాధశ ఆధ్వర్యంలో కథక్ నృత్య ప్రదర్శనతో అలరించారు. తిరుపతికి చెందినమధువాణి, శ్రీనివాసులు, కృపావతి బృందాలు కోలాటాలతోను, డాక్టర్ మురళీ కృష్ణ బృందం జానపద నృత్యంతో అలరించారు. బెంగుళూరుకు చెందిన మేఘన బృందం వీరఘాస నృత్యంతో కనువిందు చేశారు. అనంతపురానికి చెందిన నగవర్షిని బృందం రాధాకృష్ణ రూపకంతోను, మైసూర్ కు చెందిన ఆకాశ్ బృందం మైసూర్ నగరి అనే కళారూపంతోను, హుబ్లీకి చెందిన గౌరి బృందం సంపూర్ణ సుందరకాండతోను భక్తులను అలరించారు. చంద్రప్రభ వాహన సేవలో

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.