ACCESS TIRUPPAVAI BOOKS TO DEVOTEES- JEO BHASKAR_ తిరుప్పావై పుస్తాకాలను భక్తులకు అందించాలి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 26 Dec. 18: Tirupati Joint Executive Officer Sri Pola Bhaskar today urged officials to ensure distribution of Thiruppavai books During the holy dhanurmasam under the aegis of the TTD Alwar Divya Prabandam project.

Addressing a meeting of officials of the TTD Alwar Divya Prabandam project at Padmavati Guest House this evening he said after discussion with prominent pundits the TTD should publish many more such books of spiritual and devotional value. Many more such publications mshiukd be readied for distribution during the upcoming Brahmotsavams of Sri Kalyana Venkateswara temple of Srinivasa Mangapuram and Sri Kodandaram temple of Vontimetta.

He also advised the TTD punting division, and publications to bring out new books in time .The epic studies project also should complete the data entry, script reading, editing works of all18 puranas on a war footing. He said the pundits should be roped in to re work the slokas and their analysis of Valmiki Ramayana. He also reviewed the activities of the Saptagiri magazine, TTD publication and sales wing, HDPP and other projects.

OSD of TTD Publications, Dr T Anjaneyulu, HDPP secretary Dr Ramanaprasad, Epic studies OSD Sri Samudrala Lakshmaiah, Coventry of Tarigonda Vengamanba project. Acharya Krishnamurthy and Chief editor of Saptagiri magazine Dr Radha Raman DyEOs Sri Hemachandra Reddy, Sri Vijaya Kumar participated in the event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTD, TIRUPATI

తిరుప్పావై పుస్తాకాలను భక్తులకు అందించాలి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 డిసెంబర్‌ 26: పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై పుస్తకాలను టిటిడి ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తులకు పంపిణీ చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి అతిధి భవనంలో బుధవారం సాయంత్రం టిటిడి ప్రాజెక్టుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రముఖ పండితులతో సమావేశం నిర్వహంచి, వారి సూచనలను పరిగణలోనికి తీసుకొని మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను ముద్రించాలన్నారు. ఇప్పటికే భక్తుల అదరణ పొందిన పుస్తకాలను మరిన్ని ముద్రించలన్నారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి ఆలయం బ్రహ్మూెత్సవాలనాటికి మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

టిటిడి ముద్రణల విభాగం, ప్రచురుణల విభాగం సమన్వయం చేసుకుని నూతన పుస్తకాలను సకాలంలో ముద్రించాలన్నారు. పురాణఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో 18 పురాణాలకు సంబంధించిన డేటా ఎంట్రీ, స్క్రిఫ్ట్‌ రీడింగ్‌, ఎడిటింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా, వాల్మీకి రామాయణంలో ఉన్న శ్లోకాలు, వాటి తాత్పార్యాలు పండితులతో రాయించాలని సూచించారు. అనంతరం సప్తగిరి మాసమాత్రిక, టిటిడి ప్రచురణల విక్రయ విభాగం, హిందూ ధర్మప్రచార పరిషత్‌, ముద్రణ విభాగం ఇతర ప్రాజెక్ట్‌లపై తిరుపతి జెఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. టి.ఆంజనేయులు, హిందూధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా. రమణప్రసాద్‌, పురాణఇతిహాస ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, త‌రిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు స‌మ‌న్వ‌యాధికారి ఆచార్య కె.జె.కృష్ణ‌మూర్తి , సప్తగిరి ప్రధాన సంపాదకులు డా. రాధారమణ, డిప్యూటీ ఈవోలు శ్రీ హేమచంద్రారెడ్డి, శ్రీ విజయకుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.