PUSHPANJALI RENDERED TO SRI ADIBHATLA NARAYANA DASU_ శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
Tirupati, 6 September 2018: In connection with 154th Birth Anniversary of Harikatha Pitamaha, Sri Adibhatla Narayanadasu, floral tributes have been paid to his statue located in SV College of Music and Dance in Tirupati on Thursday.
A three day musical fiesta and Harikatha Parayanam will be there in Mahati Auditorium between 6pm and 8pm.
Meanwhile Sri Narayanadasu was born in 1864 on August 31 in Ajjada village of Vijayanagaram district and was a multi talented personality. He propagated the Potana Bhagavatham to the common folk through his expertise of Harikatha.
Music College Principal Dr YVS Padmavathi and others took part in the Pushpanjali programme.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి, 2018 సెప్టెంబరు: హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాస 154వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి గురువారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వైవిఎస్.పద్మావతి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఆనంతరం కళాశాల విద్యార్థులు బృందగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరికథా విభాగం అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర్లు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాఠవాలు ప్రదర్శించేవారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించండంలో నారాయణదాసవర్యులు కాళిదాస మహాకవికి సమానమైనవారు. వీరు రచించిన హరికథా రచనలు, సాహిత్యగ్రంథాలు, సంగీతరూపకాలు కవి, గాయక, పండితులకు మనోజ్ఞమైన ఆనందాన్ని కలిగించాయి. ఈయన రచించిన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివి. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి. ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.