AKHANDA BALAKANDA PARAYANAM HELD _ భక్తిసాగరంలో ముంచెత్తిన బాలకాండ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 01 APRIL 2023: The 15th edition of Akhanda Balakanda Parayanam was organised on the Nada Neerajanam platform in Tirumala on Saturday.

The Veda pundits, scholars and devotees recited 89 shlokas from chapters 71 to 73 on the occasion.

SVBC live telecasted the programme between 7am and 9am for the sake of global devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తిసాగరంలో ముంచెత్తిన బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2023 ఏప్రిల్ 01: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌నివారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు 15వ‌ విడ‌త బాల‌కాండ అఖండ పారాయ‌ణం భక్తజనరంజకంగా సాగింది.

బాలకాండలోని 71 నుండి 73వ సర్గల వ‌ర‌కు గ‌ల 89 శ్లోకాలను పారాయణం చేశారు. అదేవిధంగా యోగవాశిస్టం, ధన్వంతరి మహామంత్రం కలిపి 25 శ్లోకాలు కలిపి మొత్తం 114 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు.

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య ప్రవా రామ‌కృష్ణ సోమ‌యాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు శ్రీ కె.రామానుజాచార్యులు, శ్రీ అనంత కృష్ణ సాయి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం “దయ సేయవయ్యా …. దయ రామచంద్ర ” సంకీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ ఉదయభాస్కర్ బృందం “శ్రీరామ దశరధ రామ ……”నామ సంకీర్తనను చివరిలో ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.