ALL SET FOR BHOOKARSHANA – CM TO TAKE PART IN THE FETE-TTD EO_ జనవరి 31న గౌ.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం : టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆలయ నిర్మాణ స్థలంలో ఏర్పాట్ల పరిశీలన

Amaravathi, 30 January 2019: As the prestigious event of Bhookarshana for the new temple to come up at the capital city of AP id on January 31, TTD EO Sri Anil Kumar Singhal inspected the arrangements along with JEO Sri P Bhaskar and CVSO Sri Gopinath Jetti.

Later speaking to media persons the EO said, Bhookarshana and Beejavapanam events will take place between 9.15am and 9.40am on Thursday in the auspicious Meena Lagnam. He said the TTD board has approved to construct Sri Venkateswara temple in the AP capital of Amaravathi at a cost of about Rs.150crores in the 25 acres of land offered by CRDA to TTD.

“Of this 25acres, the temple will come up in about 7acres of land while in the remaining space, Pushkarani, spiritual complex depicting the vaibhavam of Lord Venkateswara, a spiritual library, convention centre etc.also come up here. We are contemplating to complete this Divya kshetram in the next couple of years”, he added.

Chief Engineer Sri Chandrasekhar Reddy, SEs Sri Ramulu, Sri Venkateswarlu, DyCF Sri Phanikumar Naidu, GM Transport Sri Sesha Reddy, DyEO Sri Rajendrudu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 31న గౌ.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం : టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ఆలయ నిర్మాణ స్థలంలో ఏర్పాట్ల పరిశీలన

జనవరి 30, అమరావతి 2019: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణార్థం జనవరి 31వ తేదీ గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా భూకర్షణం, బీజావాపనం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఆలయ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టితో కలిసి ఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం 9.15 నుండి 9.40 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా భూకర్షణం జరుగుతుందన్నారు. పది రోజులపాటు వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. గౌ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఆర్డిఏ కేటాయించిన 25 ఎకరాల స్థలంలో 7 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో రాతి కట్టడంతో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని, రెండు సంవత్సరాల కాలంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. మిగిలిన 18 ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా పెద్ద పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో రూ.34.60 కోట్లతో, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మించామని తెలిపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.7.5 కోట్లు కేటాయించామన్నారు. అదేవిధంగా, విశాఖపట్నంలో – రూ.7.90 కోట్లతో, ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతాల్లో కలిపి – రూ.13.50 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. చెన్నైలో రూ.5.75 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు.

భూకర్షణం కార్యక్రమం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి శ్రీవారిసేవకులు, భజన మండళ్ల సభ్యులు, భజన కళాకారులు పాల్గొంటున్నారన్నారు. భూకర్షణం కార్యక్రమాన్ని భక్తులందరూ వీక్షించేలా డిస్ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు.

అంతకుముందు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ భూకర్షణం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. బుధవారం నాడు చతుర్వేద పారాయణం, గోపూజ, శ్రీవారి నూతన ఆలయ ప్రదేశంలో వాస్తుహోమం, యాగశాల కార్యక్రమాలు జరిగాయన్నారు. గురువారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, లోకకల్యాణం కోసం ఫిబ్రవరి 7 నుండి 10వ తేదీ వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగ కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఇలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ రాములు, డిఎఫ్ఓ శ్రీ ఫణికుమార్ నాయుడు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ విజయ సారథి, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.