ALL SET FOR GRAND SRI VENKATESWARA VAIBHAVOTSAVAMS FETE AT HYDERABAD FROM OCTOBER 11-15 _ హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

ANKURARPANAM KICK-STARTS VEDIC RITUALS

Hyderabad,10 October 2022: The capital city of Telangana State, Hyderabad is all set ready to host the five-day mega religious festival of Sri Venkateswara Vaibhavotsavam from October 11-15.

The Ankurarpanam fete was held on Monday by TTD with the support of donors Sri Harsha Vardhan, Sri SS Reddy, Sri Venkateswara Reddy and Sri Subba Reddy.

As part of the fete Punyahavachanam, Viswaksena Aradhana, Vastu Shanti, Senadhipati Utsavam were performed on Monday evening.

SRIVARI MODEL TEMPLE SET UP AT NTR STADIUM

TTD has set up a model Srivari temple at NTR stadium where Nitya Kainkaryams as in Tirumala temple would be replicated in this temple.

Starting with Suprabatam at 6am, Tomala Seva, Koluvu, Archana, Nivedana, Sattumora followed by Weekly Sevas and Sarva Darshana to devotees from morning 10am to evening 7.30 pm.

Similarly, Sahasra Deepalankara Seva Veedhi Utsava, night Kainkaryams and finally Ekantha Seva will mark the closure of daily sevas for the day during these five days.

Among the weekly sevas  Vasantothsavam on October 11, Sahasra Kalashabhisekam on October 12, Tiruppavada Seva on October 13, Abhisekam and Nija pada Darshan Seva on October 14 and finally Sri Srinivasa Kalyanam on October 15 will be conducted.

Significance of Vaibhavotsavam

All devotees who visit Tirumala do not get to see the daily rituals at Srivari temple and many do not get opportunity for more Darshan due to financial burdens and old age problems. TTD is conducting the Vaibhavotsavam fete in several regions to resolve the above issue of devotees bring the blessings of Srivaru to their doorsteps. The tradition has been revived after a gap of two years of the pandemic Corona.

Extended arrangements 

A flower and the electrical decorated platform is set up near the model Srivari temple for showcasing rituals and for devotees to comfortably sit under the large German sheds. Separate food counters for the distribution of Anna Prasadam and queue lines are also arranged.

All the Vedic rituals are performed by the Archakas of Srivari temple along with their assistants. Artists of the Annamacharya project render sankeetans and Dasa Sahitya project artists render dharmic discourses as part of cultural  programs 

The PR department has set up a photo exhibition with flexes on Gosamrakshanashala, organic products and other important issues. Srivari Sevakulu in large number will be rendering services to devotees. The SVBC is providing live telecast of these programs.

TTD has also made available Panchagavya products and TTD diaries and calendars for sale at the location.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

– అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు ఉత్సవాలు

– అంకురార్పణతో వైదిక క్రతువులు ప్రారంభం

హైదరాబాద్, 2022 అక్టోబరు 10: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తోంది. దాతలు శ్రీ హర్షవర్ధన్‌, శ్రీ ఎస్‌ఎస్‌.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి సహకారంతో టిటిడి ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది.

ఈ ఉత్సవాల కోసం సోమవారం సాయంత్రం వైదిక క్రతువులు ప్రారంభమయ్యాయి. అంకురార్పణంలో భాగంగా పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, వాస్తుశాంతి, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.

నమూనా ఆలయంలో రోజువారీ కార్యక్రమాలు

ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు వారపు సేవ, ఉదయం 10 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అదేవిధంగా, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.

వారపు సేవల్లో భాగంగా అక్టోబరు 11న ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు వసంతోత్సవం, అక్టోబరు 12న ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు సహస్ర కలశాభిషేకం, అక్టోబరు 13న ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు తిరుప్పావడ, అక్టోబరు 14న ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు అభిషేకం, ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిజపాదదర్శనం, అక్టోబరు 15న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

వైభవోత్సవాల నేపథ్యం…

తిరుమలకు వచ్చే భక్తులందరూ స్వామివారికి జరిగే నిత్య, వారోత్సవాలు తిలకించడం సాధ్యంకాదు. వయోభారం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనేక మంది స్వామివారిని ఎక్కువ సార్లు చూసి తరించే అవకాశం ఉండదు. భక్తులకు ఈ లోటు లేకుండా చేయడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో  నిర్వహించే నిత్య, వార సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది. కరోనా కారణంగా రెండున్నర ఏళ్ల విరామం తరువాత నెల్లూరు నగరం నుంచి ఈ ఉత్సవాలను టిటిడి పునఃప్రారంభించింది.

విస్తృత ఏర్పాట్లు

నమునా ఆలయం వద్ద సేవల నిర్వహణకు ఆకట్టుకునేలా స్టేజి ఏర్పాటు చేశారు. భక్తులు కూర్చుని సేవలను దర్శించేందుకు వీలుగా కుర్చీలు, ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా విశాలమైన జర్మన్ షెడ్ ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందువల్ల అన్నప్రసాదాల వితరణ కోసం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అర్చకస్వాములు, పరిచారకులు ఇతర ఆలయ సిబ్బంది స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమాలు, దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో గోసంరక్షణ, గో ఆధారిత ఉత్పత్తులు ఇతర ముఖ్యమైన అంశాలపై ఫ్లెక్సీలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. వైభవోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులతో సేవలందిస్తున్నారు. ఎస్వీబీసీ ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. పంచగవ్య ఉత్పత్తులతో పాటు 2023 డైరీలు, క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంచారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.