ALL SET FOR MAHA SAMPROKSHANA FETE ON MARCH 23 AT SV TEMPLE, VISHAKAPATNAM _ మార్చి 23న విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు ఏర్పాట్లు పూర్తి

Tirupati,22, March 2022: TTD has made all arrangements for the grand conduct of the Maha Samprokshana fete at the newly built  Sri Venkateswara temple at Visakhapatnam.

The holy ritual of Vigraha pratista and Maha Samprokshana will be performed between 09.00-11.30 am on, Wednesday, March 23.

On Tuesday among  others, the programs of BimbaVastu, Nava Kalasha snapanam, Chaturdashsa Kalasha snapanam were performed at the yagashala in the morning,

Similarly in the evening, the programs of Maha Shanti thirumanjanam and later at night the Raksha bandhanam, Kumbha Aradhana, Nivedana, Shayanadhivasam, Horgan, Sarva Devata Archana Homam were performed at the Yagashala.

On March 23, Wednesday the programs of Kumbakonam Aradhana, nivedana Homa, Maha Purnahuti followed by Pradipta of main idols of goddesses will be brought inside the temple and the Maha Samprokshana ritual will be performed in vrusabha Laguna, between 09.50-11.30 am.

Thereafter dwajarohanam and archaka bahumana, will be observed followed by Kalyanotsavam in the evening and the dwajavarohanam program.

TTD board member Sri Pokala Ashok Kumar JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti CE Sri Nageswar Rao, Srivari temple Chief Archana Sri Venugopal Dikshitulu, Agama adviser Sri Vedanta Vishnu Bhattacharya, SE electrical Sri Venkateswarlu. Dyeo Dr Ramana Prasad and VGO Sri Manohar were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 23న విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2022 మార్చి 22: విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మార్చి 23న బుధవారం మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

కాగా, మంగ‌ళ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు బింబ‌వాస్తు, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం, చ‌తుర్ద‌శ క‌ల‌శ స్న‌ప‌నం, యాగ‌శాల కార్యక్ర‌మాలు నిర్వహించారు. తిరిగి సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి 8 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు ర‌క్షాబంధ‌నం, కుంభారాధ‌నం, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, హౌత్రం, స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌, హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేపట్టారు.

మార్చి 23న బుధ‌వారం ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, ఉద‌యం 9 గంట‌ల‌ నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు కుంభాల‌ను, ప్ర‌ధాన దేవ‌తా విగ్ర‌హాల‌ను ప్ర‌ద‌క్షిణగా ఆల‌యంలోకి తీసుకొచ్చి ఉద‌యం 9.50 నుండి 10.20 గంట‌ల మ‌ధ్య వృష‌భ ల‌గ్నంలో మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ధ్వ‌జారోహ‌ణం, అర్చ‌క బ‌హుమానం అందిస్తారు. సాయంత్రం 3 నుండి 4.15 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది. అనంత‌రం ధ్వ‌జావ‌రోహ‌ణం చేప‌డ‌తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈఓ డా.రమణప్రసాద్, విజిఓ శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.