ANDAL TIRUVADIPURAM _ జూలై 22న శ్రీ ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం
TIRUPATI, 21 JULY 2023: Andal Tiruvadipuram Utsavam will be observed in Sri Govindaraja Swamy temple on July 22.
As part of it, in the morning Sattumora, Snapanam and in the evening Asthanam will be observed followed by a procession along Mada streets.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 22న శ్రీ ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం
తిరుపతి, 2023 జూలై 21: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 22వ తేదీ శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది.
శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స్ గీతామందిరం,ఆర్ ఎస్ మాడవీధిలోని వైఖానసాచార్యుల వారి ఆలయం, చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.