ANKURARPANA HELD _ మే 13 నుండి 21వ తేదీ వరకు తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 12 MAY 2022: The annual fete of Sri Kariyamanikya Swamy will be observed between May 13-21 and in this connection, Ankurarpanam was held on Thursday.

This TTD sub-temple is located in Tummuru village of Naidupeta Mandal in Tirupati district.

The important days includes Dhwajarohanam on May 13, Garuda Vahanam on May 15, Kalyanam on May 18, Paruveta Utsavam on May 20 and Chakra Snanam on May 21.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 13 నుండి 21వ తేదీ వరకు తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 మే 12: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులోభాగంగా గురువారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

13-05-2022 ధ్వజారోహణం శేష వాహనం

14-05-2022 తిరుచ్చి ఉత్సవం హనుమంత వాహనం

15-05-2022 ద్వార దర్శనం గరుడసేవ

16-05-2022 తిరుచ్చి ఉత్సవం హంస వాహనం

17-05-2022 తిరుచ్చి ఉత్సవం విమాన వాహనం

18-05-2022 తిరుచ్చి ఉత్సవం మోహినీ అవ‌తారం, సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

19-05-2022 రథోత్సవం తిరుచ్చి ఉత్సవం

20-05-2022 తిరుచ్చి ఉత్సవం పార్వేట ఉత్సవం

21-05-2022 చక్రస్నానం ధ్వజావరోహణం

22-05-2022 అభిషేకం పుష్పయాగం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 18వ తేదీ సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.