ANKURARPANAM FOR BALALAYA AT KARVETINAGARAM TEMPLE _ కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యంలో బాలాలయం సంప్రోక్షణకు అంకురార్పణ

Tirupati, 22 Jan. 21: TTD organised traditional Ankurarpanam on Friday night at Sri Venugopal Swamy temple in Karvetinagaram for conducting the Balalaya samprokshana.

As part of the event, the religious activities commenced with Ritwik varanam (acharya varanam) in the morning. Ankurarpanam was conducted at the temple yagashala from 6pm till 8.30 pm.

On Saturday, January 23, veridical activities will be observed at yagashala in the morning and in the evening between 6pm and 8.30 pm Kalakarshana will be held by avahana of Sri Venugopal swami into a Kumbha and Aradhana at the Yagashala.

On January 24 vaidika programs like Ksheeradhivasam, Jaladhivasam will be performed followed by Mahashanti Thirumanjanam and Sayanadhivasam in the evening.

On January 25 the sacred event of Balalaya Samprokshana will be conducted in the auspicious Kumbha lagnam between 8.30am and 10am.

DyEO Smt Parvati, Kankana bhattar Sri Seetharamacharyulu, AEO Sri Durgaraj, Superintendent Sri Ramesh, Temple Inspector Sri Kumar, Archakas and officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యంలో బాలాలయం సంప్రోక్షణకు అంకురార్పణ

 తిరుప‌తి, 2021 జ‌న‌‌వ‌రి 22: కార్వేటినగరం లోని  శ్రీ వేణుగోపాలస్వామివారి ఆల‌యంలో శుక్ర‌వారం రాత్రి  బాలాలయ సంప్రోక్షణకు  శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 10 గంట‌ల‌కు రుత్విక్‌ వరణం(ఆచార్య‌వ‌ర‌ణం)తో శ్రీ వేణుగోపాలస్వామివారి ఆల‌యంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఆల‌యంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు.

కాగా, జ‌న‌వ‌రి 23న శ‌ని‌వారం ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని శ్రీ వేణుగోపాల‌స్వామివారి మూల‌మూర్తి శ‌క్తిని కుంభంలోకి ఆవాహ‌న చేసి యాగ‌శాల‌లో ప్ర‌తిష్టించి ఆరాధ‌న‌లు చేప‌డ‌తారు.

జ‌న‌వ‌రి 24వ తేదీల‌లో ఉద‌యం 8 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, , క్షేరాధివాసం, జలదివాసం నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, సయనాధివాసం చేప‌డ‌తారు.

జ‌న‌వ‌రి 25వ తేదీ ఉదయం 8.30 నుంచి 10 గంటల మధ్య కుంభ‌ లగ్నంలో బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సీతారామాచార్యులు, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూప‌రిండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కుమార్, అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.