ANNAMACHARYA FETE COMMENCES IN TIRUPATI _ ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

TIRUPATI, 16 MAY 2022: The 614th Jayanthi Celebrations of Saint Poet Sri Tallapaka Annamacharya commenced in Tirupati on Monday.

 

The artists of the Annamacharya Project presented Sapthagiri Sankeertans while Sri Venkateswarulu Bhagavatar rendered Harikatha.

 

At Mahati also special programmes are organized for the occasion.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం

ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2022 మే 16: తిరుమ‌ల‌ శ్రీవేంకటేశ్వరస్వామివారి తత్త్వాన్ని లోకానికి చాటిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతి ఉత్సవాలు సోమ‌వారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం విశేషంగా ఆకట్టుకుంది.

ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు రాగభావయుక్తంగా ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు. ఉద‌యం 10.30 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు భాగవతార్‌ హరికథ వినిపించారు.

సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన ఆచార్య క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి “అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు – వైష్ణ‌వ భ‌క్తి ” అనే అంశంపై ఉప‌న్య‌సించ‌నున్నారు. రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి ప్ర‌సూన‌ బృందం ఆధ్వర్యంలో గాత్ర సంగీత కార్యక్రమం జరుగనుంది.

మహతి కళాక్షేత్రంలో :

తిరుపతి మహతి కళాక్షేత్రంలో సోమ‌వారం సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఫ‌ణినారాయ‌ణ‌ బృందం అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ ల‌హ‌రి గాత్ర సంగీత కార్యక్రమం, రాత్రి 7.30 గంట‌ల‌కు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి శైల‌జ బృందం భ‌ర‌త‌నాట్యం కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.