ANNAMACHARYA TAUGHT SHARANAGATA PRAPATTI TO COMMONERS -SCHOLARS _ భక్తులకు శరణాగతి నేర్పిన అన్నమయ్య : ఆచార్య క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి

TIRUPATI, 19 MARCH 2023: Saint Poet Sri Tallapaka Annamacharya has taught Sharanagata Prapatti to the common people through his Sankeertans, univocally said, the scholars who participated in the literary meet on the occasion of 520th Annamacharya Vardhanti.

The programme took place at Annamacharya Kalamandiram in Tirupati on Sunday where in stalwarts like Prof. Mahalakshmi, Prof. Ranganathan, TUDA Secretary Smt Lakshmi participated and said Annamacharya kritis were well received by common man and taught them to incline towards the devotional path.

In the evening, vocal concert by Sri Chaitanya brothers from Vizag will be organised while in Mahati Auditorium, Vocal by Dr Vandana and dance by the students of the Principal of SV College of Music and Dance Dr Uma Muddubala will be performed.

Annamacharya Project Director Dr Vibhishana Sharma, Astana Vidwan Dr Balakrishna Prasad, renowned Satavadhani Sri Murali participated in the literary meet.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు శరణాగతి నేర్పిన అన్నమయ్య : ఆచార్య క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి
 
తిరుపతి, 2023 మార్చి 19: భగవంతుని తత్వాన్ని తెలుసుకునేందుకు శరణాగతి తప్ప మరో మార్గం లేదని భక్తులకు అన్నమయ్య తెలియజేశారని ఆచార్య క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాహితీ సదస్సులు  ప్రారంభ‌మ‌య్యాయి.
 
ఈ సంద‌ర్భంగా ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు క‌ట్ట‌మంచి మ‌హాల‌క్ష్మి ”అన్నమయ్య సంకీర్తనలు –  నైతికతత్వం ” అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య సంకీర్తనల్లో  అహింస, సచ్ఛీలత, భక్తి, శరణాగతి, నామసంకీర్తనం ప్రధానంగా ఉన్నాయన్నారు. అన్ని వర్గాల వారు నైతిక విలువలతో ఎలా జీవించాలి అనే  విషయమై అన్నమయ్య తన సంకీర్తనలలో వివరించినట్లు తెలిపారు. హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామసంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివ‌రించారు.
 
 తుడా కార్యదర్శి శ్రీమతి లక్ష్మి  ‘అన్నమయ్య సంకీర్తనలు-నేటి యువత’ అనే అంశంపై మాట్లాడారు. సామాన్యప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్నమయ్య కీర్తనలను రచించినట్టు తెలిపారు. తన 32వేల సంకీర్తనల్లో వాడుక భాషలోని సామెతలు, పలుకుబడులను ఉపయోగించి చదువుకోని వారికి  సైతం అర్థమయ్యేలా రచనలు చేశారని కొనియాడారు. నేటి యువతకు అన్నమయ్య సంకీర్తనలను చేరువజేయాలని ఆమె వివరించారు.
     
జాతీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్  ‘అన్నమయ్య సంకీర్తనలు – ఆళ్వార్లు’ అనే అంశంపై మాట్లాడారు . అన్న‌మ‌య్య ఆళ్వార్ల‌ దివ్య ప్ర‌బందాల‌ను, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, వారు ఉప‌దేశించిన న‌వవిధ‌ భ‌క్తి మార్గాల‌తో శ్రీ‌వారిని సేవించి, వేలాది సంకీర్త‌న‌లు ర‌చించార‌న్నారు. ఆళ్వార్లు, ఆచార్యులు, గురువుల అభిమ‌తాన్ని అన్న‌మ‌య్య త‌న కీర్త‌న‌ల్లో అవిష్క‌రించిన‌ట్లు వివరించారు.  
 
సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశాఖపట్నం కు చెందిన శ్రీ చైతన్య బ్రదర్స్ బృందం  గాత్ర  సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.
 
మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం గాత్ర  సంగీతం జరుగుతుంది. రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దు బాల బృందం భరతనాట్యం కార్యక్రమాలు  జరుగనున్నాయి. 
 
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ  విభీషణ శర్మ , టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ప్రముఖ శతావధాని శ్రీ ఆముదాల మురళి పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.