ANNAMAIAH 518thVARDHANTHI FROM APRIL 7-11 _ ఏప్రిల్ 7 నుండి 11వ తేదీ వ‌రకు శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 518వ వ‌ర్ధంతి ఉత్సవాలు

Tirupati, 6 Apr. 21: TTD is organising the 518th Death Anniversary of saint-poet Sri Tallapaka Annamacharya at Tirupati, Tirumala and Tallapaka from April 7-11 in total adherence to Covid-19 guidance.

The celebrations will be conducted simultaneously at Annamacharya Kala Mandiram and Mahati auditorium in Tirupati, Narayanagiri Gardens in Tirumala and at Dhyanara Mandiram and 108 feet Annamaiah statue at Tallapaka in YSR Kadapa district.

Acharya S Dakshinamurthy Sharma, Director of the Annamacharya project is supervising all arrangements.

 AT TIRUPATI

 As part of the celebrations, Metlotsavsm will be held at Alipiri Padala Mandapam. The devotees will gather on April 7 at 6am and commence a foot journey to Tirumala with bhajans and Kolata performances.

In the evening of April 8, Sapthagiri Sankeetana Gosti Ganam will be held at Narayanagiri gardens at Tirumala.

On April 8, Dwadasi Sapthagiri Sankeetan Gosti Ganam is daily conducted at the Annamacharya Kala Mandiram in Tirupati. On April 9-10 literary conference will be organised from 10.30am onwards.

On April 11, Sri Govindarajaswami Asthanam and Bhakti SangeetaSabha is scheduled at the same venue.

At the Mahati auditorium, devotional music and dance performances will be held from April 8 to 11 in the evenings.

AT THALLAPAKA

TTD is organising Dwadasi Sapthagiri Sankeertana Gana Gosti daily at Dhyana Mandiram of Tallapaka from April 8 to 11. 

Similarly, Bhakti sangeet and Harikatha programs are slated at the 108 feet statue of Annamacharya in the evenings from April 8 to 11.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 7 నుండి 11వ తేదీ వ‌రకు శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 518వ వ‌ర్ధంతి ఉత్సవాలు

తిరుపతి, 2021 ఏప్రిల్ 06: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 518వ వ‌ర్ధంతి ఉత్సవాలు ఏప్రిల్ 7 నుండి 11వ తేదీ వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రంలో, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వ‌హిస్తారు. అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య సింగ‌రాజు ద‌క్షిణా‌మూర్తి శ‌ర్మ ఈ కార్య‌క్ర‌మాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తిరుప‌తిలో

ఏప్రిల్‌ 7వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం జరుగనుంది. ఈ సంద‌ర్భంగా భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ తిరుమలకు పాదయాత్రగా వెళ్తారు.

ఏప్రిల్ 8న సాయంత్రం 6 గంటలకు తిరుమల నారాయణగిరి ఉద్యానవనానికి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపుచేసి స‌ప్త‌గిరి సంకీర్త‌నా గోష్ఠిగానం నిర్వహిస్తారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 8న ఉద‌యం 9 గంట‌ల నుండి దిన‌ము ద్వాద‌శి, స‌ప్త‌గిరి సంకీర్త‌న‌ల‌ గోష్టిగానం నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 9, 10వ తేదీల్లో ఉద‌యం 10.30 నుండి గంట‌ల నుండి సాహితీ స‌ద‌స్సులు జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 11న ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆస్థానం, సంగీత స‌భలు నిర్వ‌హిస్తారు.

మ‌హ‌తి ఆడిటోరియంలో ఏప్రిల్ 8 నుండి 11వ తేదీ వ‌ర‌కు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీత స‌భ‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు పాల్గొననున్నారు.

తాళ్ల‌పాక‌లో

తాళ్లపాకలోని ధ్యానమందిరం వ‌ద్ద ఏప్రిల్ 8న ఉద‌యం 9 గంట‌లకు దిన‌ము ద్వాద‌శి, స‌ప్త‌గిరి సంకీర్త‌న‌ల‌ గోష్టిగానం నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 8 నుండి 11వ తేదీ వ‌ర‌కు తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు సంగీతం, హ‌రిక‌థ కార్యక్రమాలు జరుగనున్నాయి.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.