AP GOVERNOR DESIGNATE SRI BISWA BHUSHAN HARICHANDAN OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న‌ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్‌

Tirumala, 23 Jul. 19: The Governor designate of Andhra Pradesh, Sri Biswa Bhushan Harichandan offered prayers in the temple of Sri Venkateswara Swamy at Tirumala on Tuesday afternoon along with his spouse Smt Suprava Harichandan and other members of the family and entourage.

On his arrival at the Srivari temple after paying visit to Sri Varahaswamy temple following the temple tradition, he was accorded warm welcome by TTD Trust Board Chief Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Special Officer of Tirumala Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti.

After darshan of Lord Venkateswara, the Governor designate was offered Vedasirvachanam at Ranganayakula Mandapam in Tirumala temple by Vedic pundits.

TTD Chairman and EO presented him with the prasadams, theertham and laminated photo of Lord Venkateswara.

Speaking on this occasion, Sri Biswa Bhushan Harichandan said that he is very fortunate to be designated as the Governor of the state of Andhra Pradesh. “With the benign blessings of Lord Balaji, I will assume the charges of Governor of AP tomorrow. It was a pleasant darshan today”, he maintained.

Earlier the EO explained the Governor designate about the average visit of number of pilgrims to Tirumala, on Annaprasadam, laddus, queue line management, hundi collections, Revenue of TTD etc.

District Collector Sri Bharatnarayan Gupta, SP Sri Anburajan, DyEO Parakamani Sri Venkataiah, Additional CVSO Sri Sivakumar Reddy, VSO Sri Manohar were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న‌ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్‌

తిరుమల, 2019 జూలై 23: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న‌ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన‌ గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ దంపతులు వ‌యోవృద్దుల క్యూలైన్‌లో ఆల‌యంలోనికి ప్ర‌వేశించారు. ఆలయంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి సాదరంగా అహ్వానించి, ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. అనంత‌రం ఆయ‌న ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ద‌ర్శ‌నానంత‌రం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, తిరుమల ప్ర‌త్యేకాధికారి క‌లిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.

అంత‌కుముందు టిటిడి ఈవో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ, ఆల‌య‌ ప్రాశ‌స్త్యం, పారిశుద్ధ్యం, ల‌డ్డూ ప్ర‌సాదాల త‌యారీ, ప‌ర‌కామ‌ణి త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న‌కు వివ‌రించారు.

ఆల‌యం వెలుప‌ల గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా భాద్య‌త‌లు చేప‌ట్ట‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శంచుకోవ‌డం చాలా దివ్యానుభూతిని క‌లిగించింద‌న్నారు. టిటిడి ఆధ్వ‌ర్యంలో ఆల‌య నిర్వ‌హ‌ణ చాలా బాగుంద‌ని కితాబు ఇచ్చారు.

ముందుగా క్షేత్ర సాంప్ర‌దాయాన్ని పాటిస్తూ ఆయ‌న‌ శ్రీ వ‌ర‌హ‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా|| నారాయ‌ణ‌ భ‌ర‌త్ గుప్తా, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి శ్రీ అన్బురాజ‌న్‌, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ఇన్‌చార్జ్ డెప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌, ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేష‌ద్రి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

పద్మావతి విశ్రాంతి భవనం చెంత గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ గారికి ఘన స్వాగతం

అంత‌కుముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న‌ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ మంగ‌ళ‌వారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం చేరుకున్నారు. వీరికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి పుష్ప‌గుచ్చ‌ల‌తో స్వాగతం పలికారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.