LEGENDARY BTU OF APPALAYAGUNTA SRI PVT_ ఆపన్నులకు అభయహస్తం అప్పలాయగుంటలో అభయహస్త ముద్రలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
Tirupati, 12 June 2019: The annual Brahmotsavams of Sri Prasanna Venkateswara temple of Appalayagunta with 1000-year-old legacy is all set to commence tomorrow Thursday, June 13.
Legends say that happy with the meditation of Sri Siddeswaraswami Lord Venkateswara had halted at Appalayagunta and hence festivals and rituals on par with Tirumala were conducted here since then.
The other significance was that the temple complex comprised of sub-temples for the galaxy of Lord Venkateswara family of deities like Goddess Padmavathi, Goddess Godadevi, Garuda, and Anjaneya. The sanctum consisted of Venkateswara idol with Abhaya hastam, Shanku, Chakra, utsava idols of consorts, Chakrathalwar, Viswaksena and Bhasyakarlu.
Prominent events of the nine day festival were : Dwajarohanam June 13 on Karkataka lagnam , Kalpavruksha vahanam and Kalyanotsavam on June 16, Garuda vahanam June 17, Chakra snanam and Dwajavarohanam June 21.
Devotees can participate in the Srivari Kalyabotsavam on June 16 wit .₹500 and beget blessings and Prasadam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
ఆపన్నులకు అభయహస్తం అప్పలాయగుంటలో అభయహస్త ముద్రలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
వెయ్యేళ్లకు పైగా చారిత్రక ప్రాశస్త్యం
జూన్ 13 నుండి 21 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
జూన్ 12, తిరుపతి, 2019: అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు అభయహస్త ముద్రలో భక్తులకు అభయమిస్తున్నారు. పురాణాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామివారు నారాయణవనంలో ఆకాశరాజు కుమారై శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలకు కాలినడకన బయలుదేరాడు. మార్గమధ్యంలో శ్రీసిద్ధేశ్వరస్వామివారి తపస్సుకు మెచ్చి ఆభయహస్తంతో దర్శనమిచ్చి అప్పలాయగుంటలో కొలువుతీరాడు. ఈ ఆలయానికి సుమారు వెయ్యేళ్లకు పైగా చారిత్రక ప్రాశస్త్యం ఉంది. కార్వేటినగర ప్రభువుల పాలనలో ఈ ఆలయం ఉండేదని, తిరుమల తరహాలో ఇక్కడ కూడా ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించారని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది.
ఆలయ విశిష్టత :
ఈ ఆలయంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి శంఖుచక్రాలు ధరించి, కటిహస్తం, అభయహస్త ముద్రతో ప్రసన్నుడై ఉంటారు. శ్రీదేవి, భూదేవి, చక్రత్తాళ్వారు, విష్వక్సేనులు, భాష్యకారుల ఉత్సవ విగ్రహాలు నిత్యపూజలు అందుకుంటున్నాయి. గర్భాలయానికి నైరుతి మూలలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, వాయవ్య మూలలో శ్రీ గోదాలక్ష్మీ(ఆండాళ్) అమ్మవారి ఆలయం, ఎదురుగా గరుత్మంతుల విగ్రహం వెలిసి ఉన్నాయి. ఆలయం వెలుపల ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయం ఉంది.
జూన్ 13న ధ్వజారోహణం :
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13న గురువారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య కర్కాటక లగ్నంలో సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
13-06-2019(గురువారం) ధ్వజారోహణం(కర్కాటక లగ్నం) పెద్దశేష వాహనం
14-06-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం
15-06-2019(శనివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
16-06-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
17-06-2019(సోమవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
18-06-2019(మంగళవారం) హనుమంత వాహనం గజ వాహనం
19-06-2019(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
20-06-2019(గురువారం) రథోత్సవం అశ్వవాహనం
21-06-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 16వ తేదీ సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.