ARADHANOTSAVAMS OF CARNATIC MUSIC TRINITY _ ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ ఎస్వీ సంగీత కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు

Tirupati, 27 Feb. 20: TTD is organising Aradhanotsavams of Trimurthy of Carnatic music – Sri Shyama Shashi, Sri Thyagaraja Swamy and Sri Muthuswamy Dikshitulu at SV College of Music and Dance on Friday.

The Aradhanotsavams will commence in the morning with special pujas and garlanding of the idols and portraits of Sangeeta Trimurtis. Thereafter that the students and teachers will sing keertans and compositions of the musical giants for 14 hours without any break.

SRI SYAMA SHASTRI (11762-1827)

Born at Thiruvarur and settled in Thanjavur. His family worshipped Goddess Kamakshi for generations and an exponent in Tamil, Telugu and Sanskrit.

Also known, as Venkatasubramanian Shastri was a contemporary of Sri Thyagaraja and Sri Muthuswamy and also like them a master of Bhairavi, Thodi and Yadukula ragas. He innovated a new trend in Thala and his works are Nava Ratna Malika and mown under the stamp of Shyamakrishna. Since his days the composition of ragas and lyrics comes to be written together.

SRI THYAGARAYA (1767-1847)

Also hailing from Thiruvarur and Thanjavur district of Tamilnadu. Sri Thyagaraya is famous as a legend of Carnatic music. Also known as Nadayogi he has penned and sung 24000 lyrics but only 750 are available now. He is also credited for reciting Rama Nama for 90 crore times on the advice of Sri Ramakrishnananda Swamy and also for having Rama darshan.

SRI MUTHUSWAMY DIKSHITULU (1775-1835) 

A native of Thiruvarur in Thanjavur district Sri Dikshitulu was the disciple of Sri Chidambar Nadayogi at Kashi and also an upasaka of God Sri Subramanya. His great works in Sanskrit are known as Kritis including Kamalambanavarna, Navagraha, Vibhakti, Panchalinga and Shodasha Ganapathi.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ ఎస్వీ సంగీత కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 27: కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ త్యాగరాజస్వామి,   శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో  ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ శుక్ర‌వారం ఘనంగా జరుగనున్నాయి.

ఆరాధనోత్సవం శుక్ర‌వారం ఉదయం 8.00 గంటలకు సంగీత త్రిమూర్తులకు పూజతో ప్రారంభమవుతుంది. సంగీత కళాశాల, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు నిరంత‌రాయంగా రాత్రి 10.00 గంట‌ల వ‌ర‌కు దాదాపు 14 గంట‌ల పాటు సంగీత త్రిమూర్తుల అపురూప కృతులు, కీర్తనలను ఆలపిస్తారు.
 
శ్రీ శ్యామశాస్త్రి (1762-1827) :

సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి తిరువారూరులో జన్మించారు. తంజావూరులో స్థిరపడ్డారు. తరతరాలుగా బంగారు కామాక్షిని పూజించిన కుటుంబ వీరిది. వీరికి వేంకటసుబ్రమణ్యం అనే పేరుంది. తెలుగు, తమిళ, సంస్కృత భాషల్లో విశేష ప్రావీణ్యం సంపాదించారు. వీరికి శ్రీత్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు సమకాలికులు. వీరి భైరవి, తోడి, యదుకుల కాంభోజి రాగాల్లోని స్వరజతులు గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాళంలో వీరు చూపిన కొత్త పోకడ ప్రశంసనీయం. వీరి కృతులు శ్యామకృష్ణ ముద్రతో ఉంటాయి. వీరి నవరత్నమాలిక కృతులు చాలా ప్రసిద్ధి పొందాయి. కీర్తనలకు చిట్ట స్వరాలు, వాటికి సాహిత్యం వీరి నుండే ప్రారంభమైంది.

శ్రీ త్యాగరాజస్వామి (1767-1847) :

శ్రీ త్యాగరాజస్వామివారు తంజావూరు జిల్లాలోని  తిరువారూరు క్షేత్రంలో శ్రీమతి సీతమ్మ, శ్రీరామబ్రహ్మం దంపతులకు జన్మించారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో రెండోవారుగా ప్రసిద్ధిచెందారు. నాదోపాసనే మోక్షహేతువని నమ్మి తరించిన నాదయోగి త్యాగయ్య చిన్నతనం నుండే భక్తి వాతావరణంలో పెరిగారు. 24 వేల కృతులు ఆలపించారని ప్రచారంలో ఉన్నా ప్రస్తుతం 750 కృతులు మాత్రమే లభ్యమవుతున్నాయి. శ్రీ రామకృష్ణానంద యతీశ్వరుల ఉపదేశంతో 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి రామ సాక్షాత్కారం పొందిన భాగవత శిరోమణి ఈయన.

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు  (1775-1835) :

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు తిరువారూరులో రామస్వామి దీక్షితులు, సుబ్బలక్ష్మి అమ్మాళ్‌ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండి భగవధ్యానపరులు. వీరు కాశీ క్షేత్రానికి వెళ్లి చిదంబరనాదయోగి వద్ద శ్రీవిద్యా ఉపదేశం చేశారు. గురువుల ఆశీస్సులు వారి ఆజ్ఞానుసారం తిరుత్తణి క్షేత్రంలో 45 రోజులుండి శ్రీ సుబ్రమణ్యస్వామిని ఉపాసించారు. వీరి కృతులు చాలావరకు సంస్కృతంలో ఉంటాయి. వీరి కమలాంబ నవార్ణకృతులు, నవగ్రహకృతులు, విభక్తి కృతులు, పంచలింగస్థల కృతులు, షోడశగణపతి కృతులు ప్రసిద్ధి పొందాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.