ARRANGEMENTS ON A SPREE FOR GODA KALYANAM _ వేగంగా గోదా కళ్యాణం ఏర్పాట్లు

Tirupati, 13 Jan. 21: As the month-long Dhanurmasa Utsavam mulled by TTD will conclude on Thursday, TTD is all set to conduct Goda Kalyanam in Parade Grounds behind TTD Administrative Building in a grand manner. 

The arrangements for the same are going on a fast pace. Akin to Kartheeka Deepotsavam, TTD will be organising this Dhanurmasa Utsavam in a big way for the first time.

The programme will be telecast live on SVBC between 6:30pm and 8:30pm. The religious event includes “Annamacharya Sankeertana Gaanamritam” followed by Goda Kalyanam performed by Archakas.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

వేగంగా గోదా కళ్యాణం ఏర్పాట్లు
– గురువారం సాయంత్రం 6 నుండి 8.30 గంటల దాకా కార్యక్రమం

తిరుపతి 13 జనవరి 2021: ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి  14వ తేదీ గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని గ్రౌండ్ లో “శ్రీ గోదా కళ్యాణం” నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

టీటీడీ తొలిసారి ఈ గ్రౌండ్ లో కార్యక్రమం నిర్వహిస్తుండటం తో అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సుమారు వెయ్యి మంది భక్తులు కూర్చుని కళ్యాణ వైభవం తిలకించేందుకు వీలుగా ఇంజినీరింగ్ విభాగం పనులు చేస్తోంది. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో గ్రౌండ్, వేదిక మీద విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు. కళ్యాణ వేదికను పుష్పాలతో అందంగా అలంకరించడానికి గార్డెన్ విభాగం పనులు ప్రారంభించింది. గురువారం ఉదయానికి పనులన్నీ పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక తయారు చేశారు. కార్యక్రమం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

కార్యక్రమం ఇలా..

సాయంత్రం 6 గంటలకు “అన్నమాచార్య సంకీర్తనా గానామృతం”  (శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే)

సాయంత్రం 6:30 గంటలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కె. రాజగోపాలన్ ప్రారంభోపన్యాసం.

సాయంత్రం 6:35 గంటలకు టీటీడీ అర్చకులచే సర్కారు / భక్త సంకల్పం

సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 8-30 గంటల వరకు టీటీడీ అర్చకులచే
శ్రీ గోదా కళ్యాణం నిర్వహణ. అనంతరం టీటీడీ అధ్యాపకులచే
“వారణమాయిరం”

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది