ARTISTS FROM 12 STATES PERFORMING IN SRIVARI BRAHMOTSAVAMS-HDPP PO _ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో 12 రాష్ట్రాల క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌లు- టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి శ్రీ రాజగోపాలరావు

STATEWISE ART FORMS EACH DAY

ALL STATES TO DISPLAY UNIQUE ARTS ON GARUDA SEVA

Tirumala,20 September 2023: All Hindu Dharmic Projects Program Officer Sri Rajagopal Rao disclosed on Wednesday that artists from 12 states are being invited to display their unique art forms during the ongoing Srivari annual Brahmotsavam in Tirumala.

Addressing reporters at Media centre in Rambagicha-2 during the press conference, he said artists from Andhra Pradesh, Telangana, Tamilnadu, Karnataka, Kerala, Odisha, Maharashtra, Jharkhand, Gujarat, Madhya Pradesh, Uttar Pradesh and Rajasthan will be displaying their art forms and skills at the Vahana sevas.

While each state is performing in front of Vahana Sevas on a day, all of them together will present their own state arts on Garuda day which is going to remain as a special attraction.

He said every day 10 teams perform in the morning and 11 in the evening Vahana sevas. Similarly, all of them also present their arts in Tirupati. 

Dasa Sahitya Project Special Officer Sri Ananda Thirthacharyulu highlighted the significance of the Brahmotsavam and that artists from Kanyakumari to Kashmir present their programs with devotion.

Annamacharya Project Director Dr Akella Vibhishana Sharma said over 470 festivals are being observed at Tirumala every year besides releasing several religious publications in front of the Vahana Sevas during Brahmotsavam.

AEO of All Dharmic Projects Sri Sriramulu, APRO Kumari P Neelima, archaka coordinator Sri Hemant Kumar, Superintendents Sri Kanti Kumar,Sri Chandramouleshwara Sharma and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో 12 రాష్ట్రాల క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌లు

– గ‌రుడ‌సేవ నాడు విభిన్న క‌ళారూపాలు

– టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి శ్రీ రాజగోపాలరావు

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 20: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌ల్లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా దేశ‌వ్యాప్తంగా ఉన్న 12 రాష్ట్రాల‌కు చెందిన క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశామ‌ని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి శ్రీ రాజగోపాలరావు వెల్ల‌డించారు. తిరుమ‌ల రాంభ‌గీచా-2లోని మీడియా సెంట‌ర్‌లో బుధ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ రాజ‌గోపాల‌రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ కలిపి మొత్తం 12 రాష్ట్రాల కళారూపాల‌ను వాహనసేవల్లో ప్రదర్శిస్తున్న‌ట్టు తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఒక్కోరోజు ఒక్కో రాష్ట్రానికి చెందిన‌ క‌ళారూపాలను క‌ళాకారులు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్పారు. గ‌రుడ సేవ‌నాడు మాత్రం 12 రాష్ట్రాలకు చెందిన విభిన్న‌ క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశామ‌ని తెలియ‌జేశారు. ప్రతిరోజూ ఉద‌యం వాహ‌న‌సేవ‌లో 10 బృందాలు, రాత్రి వాహ‌న‌సేవ‌లో 11 బృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నాయ‌ని తెలిపారు. అదేవిధంగా, తిరుమలలో ఆస్థానమండపం వేదికతోపాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ఆధ్యాత్మిక, ధార్మిక ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు.

దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ సాక్షాత్తు బ్ర‌హ్మ‌దేవుడు జ‌రిపిన ఉత్స‌వాలు కావ‌డంతో వీటికి బ్ర‌హ్మోత్స‌వాలు అనే పేరు వ‌చ్చింద‌ని చెప్పారు. ఈ ఉత్స‌వాల్లో కాశీ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు వివిధ రాష్ట్రాల జాన‌ప‌ద క‌ళారూపాల‌ను క‌ళాకారులు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు వివ‌రించారు.

అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ మాట్లాడుతూ క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవ‌మైన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి ఏడాది పొడ‌వునా 470కి పైగా ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని, ఇందులో బ్ర‌హ్మోత్స‌వాలు విశేష‌మైన‌వ‌ని చెప్పారు. అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో వాహ‌న‌సేవ‌ల ఎదుట క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోపాటు ప్ర‌చుర‌ణ‌ల విభాగం ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిరోజూ వాహ‌న‌సేవ‌ల్లో ఆధ్యాత్మిక గ్రంథాల‌ను ఆవిష్క‌రిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు.

మీడియా స‌మావేశంలో ధార్మిక ప్రాజెక్టుల ఎఈవో శ్రీ శ్రీ‌రాములు, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ, అర్చ‌క శిక్ష‌ణ కో-ఆర్డినేట‌ర్‌ శ్రీ హేమంత్‌కుమార్, సూప‌రింటెండెంట్లు శ్రీ కాంతికుమార్‌, శ్రీ చంద్ర‌మౌళీశ్వ‌ర శ‌ర్మ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.