ASTALAKSHMI STEAL THE LIMELIGHT _ స‌ర్వ‌భూపాల వాహనసేవ‌లో అష్ట‌ల‌క్ష్ములు

TIRUMALA, 30 SEPTEMBER 2022: On the fourth day evening of the ongoing annual Brahmotsavam, the Astalakshmi get ul displayed by the Tirupati troupe attracted the devotees.

Besides, Puducheri’s Oliyattam, chekka bhajana by Hyderabad artists, Odisha Kolatam also allured the pilgrims.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

స‌ర్వ‌భూపాల వాహనసేవ‌లో అష్ట‌ల‌క్ష్ములు

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 30: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు స‌ర్వ‌భూపాల వాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 17 క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చాయి.

ఈ సంద‌ర్భంగా తిరుప‌తికి చెందిన క‌ళాబృందం అష్ట‌ల‌క్ష్ముల వేష‌ధార‌ణ ఆక‌ట్టుకుంది. వీరిలో ధ‌నల‌క్ష్మి, ధాన్య‌ల‌క్ష్మి, సంతాన‌ల‌క్ష్మి, ధైర్య‌ల‌క్ష్మి, గ‌జ‌ల‌క్ష్మి, ఆదిల‌క్ష్మి, విజ‌య‌ల‌క్ష్మి, విద్యాల‌క్ష్మి వేష‌ధార‌ణ‌లో క‌ళాకారులు అల‌రించారు. అదేవిధంగా, రాజ‌మండ్రికి చెందిన క‌ళాకారులు ప్ర‌ద‌ర్శించిన భువ‌నేశ్వ‌రి కోలాటం, పుదుచ్చేరి క‌ళాకారులు ఓళియాట్టం, హైద‌రాబాద్ కళాకారుల చెక్క‌భ‌జ‌న‌, బెంగ‌ళూరు క‌ళాకారుల భ‌ర‌త‌నాట్యం, ఒడిశా క‌ళాకారుల కోలాటం ఆక‌ట్టుకున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.