ASTHANAM PERFORMED _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం
Tirumala, 27 August 2024: The traditional temple court on the auspicious occasion of Sri Krishna Jayanti, the Gokulastami Asthanam was observed with religious fervour in Tirumala temple on Tuesday night.
After the ceremonious rituals at Bangaru Vakili to the Utsava deities including Sri Krishna Swamy, the Veda pundits recited the Sri Krishna Jananam episode from the sacred texts.
Temple officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం
తిరుమల, 2024 ఆగస్టు 27: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా భావించి ఆస్థానం నిర్వహిస్తారు.
రాత్రి 8 గంటలకు శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ద్వాదశారాధనం చేపట్టారు. శ్రీకృష్ణ స్వామివారిని బంగారు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి ప్రబంధగోష్ఠి, పురాణ పఠనం చేపట్టారు.
కాగా ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.