ASTOTTARA KALASHABISHEKAM AT SRI KRT ON JAN 10 _ జనవరి 10న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati, 9 Jan. 20: As a part of Pournami celebrations, TTD plans to conduct Astottara Kalashabisekam at Sri Kodandarama Swamy temple on January 10.

Devotees can participate in this fete by purchasing a ₹50 ticket. Later in evening a procession of utsava idols of Sri Sita Lakshamana sameta Sri Kodandarama Swamy, before taken for Asthanam at Sri Ramachandra Pushkarani.

KALYANOTSAVAM ON JAN 11

TTD is conducting grand Kalyanotsavam of Sri Ramachandra Swamy and Sita Devi on January 11. Interested devotee couple could participate on the payment of ₹500 per ticket on which two persons will be allowed and beget uttarium, blouse and Anna Prasadam.

Later the utsava idols will be paraded on mada streets and for Unjal seva at Sri Ramachandra Pushkarani. TTD appeals that participants should wear traditional clothes for taking part in celestial kalyanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జనవరి 10న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 09: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

జనవరి 11న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 11వ తేదీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.

శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.