AYUDHA PUJA HELD _ రవాణా విభాగంలో వేడుకగా ఆయుధ పూజ
TIRUPATI, 04 NOVEMBER 2023: Ayudha Puja was observed in the Transport Wing of TTD in Tirupati on Saturday.
Special Puja was held to the Srivari statue located in the premises and also to the entire fleet of vehicles which were finely decked on the occasion.
Both the JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, SM Transport Sri Sesha Reddy, DLO Sri Veeraju, VGO Sri Bali Reddy, DM Smt Lakshmi Prasanna, DIs Sri Mohan, Sri Subrahmanyam, Transport staff, drivers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
రవాణా విభాగంలో వేడుకగా ఆయుధ పూజ
తిరుపతి, 2023 నవంబరు 04: టీటీడీ రవాణా విభాగంలో శనివారం ఆయుధపూజ వేడుకగా నిర్వహించారు. జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా రవాణా కార్యాలయం వద్దకు చేరుకున్న జేఈవోలకు ఆ విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీవారి విగ్రహనికి పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించిన అనంతరం జిఎం శ్రీ శేషారెడ్డి జేఈవోలను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డిఎల్‌వో శ్రీ వీర్రాజు, విజివో శ్రీ బాలిరెడ్డి, ట్రాన్స్ పోర్ట్ డిఎం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, డిఐ శ్రీ మోహన్‌తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.