BALAKANDA AKHANDA PARAYANAM HELD _ బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన సప్తగిరులు

TIRUMALA, 12 JANUARY 2022: The fifth edition of Balakanda Akhanda Parayanam was held with devotional fervour at the Nada Neerajanam platform in Tirumala on Wednesday.

All the 130 shlokas from Chapters 18-21 were recited by Vedic scholars and Veda Parayanamdars on the occasion.

At the beginning of the program, the Annamacharya Project artists rendered famous Tyagaraja Kriti, “Jagadananda Karaka” while the program concluded with Sri Rama Bhajana by the Sri Nagarajan team from Hyderabad.

This program was telecasted live on SVBC between 6am and 8am for the sake of global devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన సప్తగిరులు

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 12: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధ‌వారం ఉద‌యం 6 నుండి 8 గంటల వరకు జరిగిన బాల‌కాండలోని 18 నుండి 21వ‌ సర్గ వ‌ర‌కు ఉన్న మొత్తం 130 శ్లోకాలు వేద పండితులు, భక్తులు చేసిన అఖండ పారాయ‌ణంతో సప్తగిరులు మార్మోగాయి.

బాల‌కాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ ‌మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన దివ్య శ‌క్తి మంత్రోచ్ఛ‌ర‌ణ అని, దీనితో స‌మ‌స్త రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. కొన్ని వంద‌ల‌ సంవ‌త్స‌రాలుగా మాన‌వులు రామాయ‌ణం వినడం, పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న బాధ‌లు తొల‌గి, సుఖ సంతోషాల‌తో ఉన్న‌ట్లు పురాణాల ద్వారా నిరూపిత‌మైన‌ద‌న్నారు. వాల్మీకి మ‌హ‌ర్షి శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని ఆశ్ర‌యించిన‌ట్లు, యావ‌త్ ప్ర‌పంచం రామనామం పలికితే స‌క‌ల శుభాలు సిద్ధిస్తాయ‌న్నారు. ప్ర‌పంచ శాంతి, క‌రోనా మూడ‌వ వేవ్ బారిన పడకుండా పిల్ల‌లు, పెద్ద‌లు అన్ని వర్గాలవారు సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని బాల‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. బాల‌కాండలోని శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మారి నివార‌ణ మంత్రమును ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌ని వివ‌రించారు.

అనంతరం ఆచార్యుల వారితో కలిసి వేద పండితులు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు.

ఈ అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

ముందుగా జ‌గ‌దానంద‌కార‌క అనే త్యాగ‌రాజ కృతితో కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ నాగ‌రాజ‌న్ బృందం చేసిన రామ‌భ‌జ‌న‌తో కార్య‌క్ర‌మం భక్తిపారవశ్యంతో ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌నరంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.