BAN ON PLASTIC USAGE IN TIRUMALA FROM NOV 1 ONWARDS-TIRUMALA JEO_ గరుడసేవనాడు విశేష సేవలందించిన టిటిడి అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు – టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 23 October 2018: The ban on plastic in Tirumala will be implemented from November 1 onwards, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
After four hour long review meeting with senior officers of Tirumala in Annamayya Bhavan on Tuesday, speaking to media persons he said, the plastic ban is being strictly observed in Tirupati from October 1 onwards. Being focal area, we too wanted to observe the same in Tirumala from November 1 under the instructions of EO Sri Anil Kumar Singhal. Before which awareness will be created in all the establishments in Tirumala for the next one week. The Estate Officer and Health Officer have been instructed to conduct meetings with hoteliers, shop keepers etc. immediately.
As per TTD is concerned, we have already dispensed with the usage of plastic carry bags in Tirumala temple. While searching for alternative arrangements to carry laddus. However we are using laddu covers over 50 microns which is a permissible specification”, he added.
FA and CAO Sri Balaji and all other senior officers were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడసేవనాడు విశేష సేవలందించిన టిటిడి అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు – టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
అక్టోబరు 23, తిరుమల 2018: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తులకు విశేష సేవలందించిన టిటిడి అధికారులకు, సిబ్బందికి టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం నాడు వివిధ విభాగాల అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు.
అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ లడ్డూ కాంప్లెక్స్‌లో లడ్డూల విక్రయానికి సంబంధించి భక్తుల సౌకర్యార్థం కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసే శక్తులను గట్టిగా హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. ఆయా విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు వారి పరిధిలో అక్రమాలకు తావు లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించినట్టు చెప్పారు. దర్శనం, లడ్డూ ప్రసాదం, కల్యాణకట్ట తదితరాలకు సంబంధించి టిసిఎస్ సంస్థ ద్వారా అందుతున్న సాఫ్ట్‌వేర్ సేవల్లో సాంకేతికంగా లోపం తలెత్తితే ఎలాంటి అంతరాయం కలగకుండా స్థానిక సర్వర్ ద్వారా భక్తులకు సేవలందించాలని, విద్యుత్ సమస్య తలెత్తితే కంప్యూటర్ ద్వారా ముందే ప్రింట్ చేసిన టోకెన్లు భక్తులకు ఇవ్వాలని సూచించారు.
తిరుపతిలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించిన తరుణంలో తిరుమలలోనూ పాటించేలా అందరినీ సన్నద్ధం చేయాలని టిటిడి ఈవో ఆదేశించారని, ఆ మేరకు మొదటగా శ్రీవారి ఆలయంలో అధికారులు, అర్చకస్వాములు, ఇతర సిబ్బంది ఎవరూ ప్లాస్టిక్ కవర్లు వినియోగించడం లేదని జెఈవో తెలిపారు. లడ్డూ ప్రసాదం కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు 50 మైక్రాన్ల కంటే ఎక్కువ గల కవర్లను వినియోగిస్తున్నట్టు వివరించారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి సంబంధించి ఎస్టేట్ అధికారి, ఆరోగ్యశాఖాధికారి నేతృత్వంలో వారం రోజుల పాటు తిరుమలలోని దుకాణదారులకు, హోటళ్ల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తారని తెలియజేశారు. వచ్చే నెల నుండి పూర్తిస్థాయిలో అమలుచేస్తామని, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.
అన్నమయ్య భవనంలో గల సమావేశంలో టిటిడి ఎఫ్ఏ,సిఏవో శ్రీ బాలాజి, ఎస్ఇ శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ మనోహర్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.