BATTERY VEHICLES TO SHUTTLE IN TIRUMALA TO AVOID POLLUTION SOON-TTD BOARD CHIEF_ తిరుమలలో కాలుష్యాన్ని అరికట్టేందుకు బ్యాటరీ వాహనాలు ప్రవేశపెట్టేందుకు యోచన : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
Tirumala, 30 Jun. 19: The Chairman of TTD Trust Board Sri YV Subba Reddy said that the diesel vehicles will be replaced with battery vehicles to shuttle in Tirumala soon to avoid vehicular pollution in the holy hills.
The board chief inspected Vaikuntham 1 and 2 compartments, Boondi Potu, queue lines in Narayanagiri Gardens on Sunday. He verified the preparation of boondi in Boondi Potu. After the inspection, the Chairman speaking to media he said, during his interaction with the pilgrims waiting in compartments, they expressed immense satisfaction over the provision of amenities including food, water, medical etc. by TTD. However they requested to find ways to minimize waiting hours for darshan as it is taking nearly 18-20 hours in the week end.
“After the formation of new board members in a week or so we will concentrate on how to reduce the waiting hours for pilgrims and ensure easy darshan of Lord. Similarly we will also concentrate on the reception area and also introducing battery vehicles in the place of diesel vehicles. To start with we are contemplating the replacement for the TTD free buses which shuttles within Tirumala”, he added.
Temple DyEO Sri Harindranath, VGO Sri Manohar, AVSO Sri Gangaraju, EE I Sri Subramanyam and others were also present during the inspection by TTD Chairman.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
తిరుమలలో కాలుష్యాన్ని అరికట్టేందుకు బ్యాటరీ వాహనాలు ప్రవేశపెట్టేందుకు యోచన : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి
తిరుమల, 2019 జూన్ 30: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో కాలుష్యాన్ని అరికట్టేందుకు డీజిల్ వాహనాలకు బదులుగా దశలవారీగా బ్యాటరీ వాహనాలు ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నామని, బోర్డు సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
టిటిడి ఛైర్మన్ ఆదివారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బూందీ పోటు, నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లను తనిఖీ చేశారు. బూందీ పోటులో బూందీ తయారీ విధానాన్ని పరిశీలించారు. తనిఖీల అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న యాత్రికులతో ముచ్చటించానని, టిటిడి అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్యసేవలు తదితర సౌకర్యాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. వారాంతంలో దర్శన సమయం 18 నుండి 20 గంటలు ఉంటోందని, దీన్ని తగ్గించాలని పలువురు భక్తులు కోరినట్టు చెప్పారు. మరో వారం రోజుల్లో నూతన ధర్మకర్తల మండలి పూర్తిస్థాయిలో ఏర్పాటవుతుందని, ఇందులో శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వసతి, బ్యాటరీ వాహనాలు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ముందుగా తిరుమలలో తిరుగుతున్న టిటిడి ఉచిత బస్సుల స్థానంలో బ్యాటరీ వాహనాలను ప్రవేశపెడతామని వివరించారు.
టిటిడి ఛైర్మన్ వెంట శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విజిఓ శ్రీ మనోహర్, ఇఇ-1 శ్రీ సుబ్రమణ్యం, ఎవిఎస్వో శ్రీ గంగరాజు తదితరులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.