BEST POSSIBLE AMENITIES TO PILGRIMS IN GALLERIES FOR GARUDA SEVA-CHAIRMAN, EO_ శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవో విస్తృత తనిఖీలు

Tirumala, 4 Oct. 19: The TTD officials have made elaborate Annaprasadam and water distribution arrangements with the help of Srivari seva volunteers to pilgrims who are sitting in all the galleries to witness Garuda Seva, said,  TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

The Chairman inspected all the galleries and interacted with the pilgrims about the amenities being provided to pilgrims by TTD.

The pilgrims expressed immense satisfaction about the supply of food and water by TTD.

Earlier, TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy also inspected all the galleries at different intervals. 

The EO said 1500 Srivari sevakulu have been rendering excellent services to pilgrims since morning in all galleries. He said devotees have also appreciated the services of volunteers. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవో విస్తృత తనిఖీలు

అక్టోబరు 04, తిరుమ‌ల‌, 2019:   శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం గరుడ వాహనసేవను పురస్కరించుకుని శ్రీవారి ఆలయ మాడ వీధులు, గ్యాలరీల్లో భక్తుల ఏర్పాట్లపై టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వేర్వేరుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. టిటిడి ఏర్పాట్లు బాగున్నాయంటూ భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.

           ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులంద‌రికీ అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలు అందేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఎక్కువ మంది భ‌క్తుల‌కు గ‌రుడ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిపారు. వైద్య‌సేవ‌లందించేందుకు మొబైల్ అంబులెన్స్‌ ఏర్పాటు చేశామ‌న్నారు. వాహ‌న మండ‌పం, గ్యాల‌రీల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. పలువురు భక్తులతో మాట్లాడి టిటిడి కల్పించిన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌, భద్రతా సిబ్బందికి సూచించారు. అనంత‌రం భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు పంపిణీ చేశారు.

         అంత‌కుముందు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ గ్యాలరీల్లోని భక్తులకు, మాడ వీధుల బయట గల భక్తులకు, దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. గరుడసేవ పూర్తయిన తరువాత కూడా భక్తులందరికీ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలు అందిస్తామ‌న్నారు. మాడ వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని, గరుడసేవ అనంతరం చెత్తను తరలించాలని అధికారులకు సూచించారు. కాగా, 1500 మంది శ్రీ‌వారి సేవ‌కులు మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లో భ‌క్తుల‌కు సేవ‌లందిస్తున్నారు. శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను భ‌క్తులు ప్ర‌శంసించారు.

 ఈ త‌నిఖీల్లో డిఐజి శ్రీ క్రాంతిరాణా టాటా, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ-1 శ్రీ‌ ర‌మేష్‌రెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్.ఆర్‌.రెడ్డి, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, క్యాట‌రింగ్ అధికారి శ్రీ శాస్త్రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.