“BHAKTULATO BHAVADEEYUDU” FROM MARCH 15_ మార్చి 15న ”భక్తులతో భవదీయుడు ”
Tirupati, March 11, 19: The phone in programme, “Bhaktulato Bhavadeeyudu” where Tirupati JEO Sri B Lakshmikantham will commence on March 15.
This phone in program will be conducted on third friday of every week between 8.30am and 9.30am. The JEO will receive the feedback from devotees over various issues related to local temples and rest houses in Tirupati on phone.
The devotees should dial 0877-2234777 and can speak to JEO directly to express their suggestions.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 15న ”భక్తులతో భవదీయుడు ”
మార్చి 11, తిరుపతి, 2019: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో మార్చి 15వ తేదీన ”భక్తులతో భవదీయుడు” కార్యక్రమం జరుగనుంది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అందుబాటులో ఉంటారు. భక్తులు ఫోన్ ద్వారా నేరుగా జెఈవో గారికి సూచనలు, సలహాలు అందించవచ్చు. ప్రతినెలా మూడో శుక్రవారం ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు : 0877-2234777.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం తదితర టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, సత్రాల్లో సౌకర్యాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడమైనది. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశముంటుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.