KURMA PURANAM RELEASED ON VYASA PURNIMA DAY_ ఆధ్యాత్మిక గ్రంథాలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు కృషి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ ఘనంగా ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ
Tirupati, 16 Jul. 19: The Telugu translation of one of the most significant literary works in Sanskrit by Sage Vyasa, Sri Kurma Maha Puranam, was released by Tirupati JEO Sri P Basant Kumar on Tuesday.
The release event took place at Annamacharya Kalamandiram in Tirupati. JEO who graced the occasion as chief guest stated that release of the translated work of the great book took place on the auspicious day of Vyasa Pournami. “All the TTD publications will be taken to the households in a big way”, he added.
Later he felicitated the scholar who translated the great book in Telugu, Sri KV Sunderacharyulu from Hyderabad. The scholar said, this book highlights the miracles of Kurmavatara.
Project officer of Sri Puranethihasa Project Dr Samudrala Lakshmanaiah, Annamacharya Project Director Sri Vishwanatham, Chief Editor of Sapthagiri Dr Radharamana were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆధ్యాత్మిక గ్రంథాలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు కృషి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్
ఘనంగా ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ
తిరుపతి, 2019 జూలై 16: సంస్కృతంలోని గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలను సరళమైన తెలుగులోకి అనువదించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టిటిడి విశేషంగా కృషి చేస్తోందని తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ తెలిపారు. టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రంథ అనువాదకులు డా.. కెవి.సుందరాచార్యులను జెఈవో శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ గురుపూర్ణిమ నాడు విశిష్టమైన గ్రంథావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ధర్మప్రచారంలో భాగంగా పలురకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంలో టిటిడికి సముచితమైన స్థానం ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించి ధర్మప్రచారాన్ని విస్తృతం చేస్తామన్నారు.
టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ ఈ గ్రంథాన్ని సంస్కృతంలో వ్యాసుడు రచించారని, ఆయన జయంతి రోజున తెలుగు అనువాద గ్రంథాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ధర్మానికి మూలాలు వేదాలని, వాటిలోని తత్వాన్ని పురాణాల ద్వారా విస్తరింపజేయడానికి వ్యాసుడు విశేషకృషి చేశారని చెప్పారు.
గ్రంథ అనువాదకులు హైదరాబాద్‌కు చెందిన డా.. కెవి.సుందరాచార్యులు మాట్లాడుతూ అష్టాదశ పురాణాల్లో 17వది శ్రీకూర్మ మహాపురాణమని, ఇందులో కూర్మావతారంలో శ్రీమహావిష్ణువు మహిమలను తెలియజేశారని వివరించారు. శ్రీవారి అనుగ్రహంతోనే ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించగలిగానని తెలిపారు.
ముందుగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా. బి.రమణప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య బి.విశ్వనాథ్, ప్రధాన సంపాదకులు డా.కె.రాధారమణ, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. టి.ఆంజనేయులు, విఎస్‌వో శ్రీ అశోక్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.