BOOKS RELEASED BEFORE CHINNA SESHA VAHANAM_ శ్రీవారి వాహనసేవలో పుస్తకాల ఆవిష్కరణ

Tirumala, 14 September 2018: In contiuance of temple practices, the TTD chairman Sri Putta Sudhakar Yadav and TTD EO Sri Anil Kumar Yadav released books on devotion, Hindu religion and philosphy.

On Friday during the ongoing Chinna Sesha Vahanam, they released a commentary on Vedas titled “Purva Mimamsa’ compiled by Dr Sripada Bhat.

Another compilation which mirrored the evolution of the universe and human being by Dr Hema Kshirasagar titled as ” Vedic Values”.

Yet another book by Dr K Leelavati on the popular Kannada haridasa “Bhakta Kanaka Dasa” and another compilation of “Sri Krishna Rayabharam” being penned by Dr Kadimilla Vara Prasad were also released on the occasion.

Among others who participated in the event were TTD board members Sri Challa Ramachandra Reddy, Smt Sudha Narayanamurthy, Sri Ramesh Babu, Tirumala JEO Sri K S Srinivasa Raju, OSD of TTD press Sri Anjaneyulu.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

శ్రీవారి వాహనసేవలో పుస్తకాల ఆవిష్కరణ

సెప్టెంబరు 14, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం జరిగిన చిన్నశేష వాహన సేవలో టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పలు పుస్తకాలను ఆవిష్కరించారు.

హైందవ సనాతన సంస్కృతి సంప్రదాయాలకు మూలం వేదవాజ్మయం. ఇందులో భాగమైన మీమాంసను సుప్రసిద్ధ సంస్కృత పండితులు డా||శ్రీపాదభట్‌ రచించిన ”పూర్వ మీమాంస”, వేదాలలో చెప్పబడిన విశ్వం యొక్క పుట్టుక, భౌతిక, ఆధ్యాత్మిక తత్త్వ వివేచన, వైదిక ఋషుల జీవనశైలి, మానవ జీవనంలో అలవర్చుకోవలసిన సత్కర్మ, సత్ప్రవర్తనలను తెలియజేసేందుకు డా||హేమ క్షీరసాగర్‌ రచించిన ”వేదిక్‌ వాల్యూస్‌”, డా|| కె.లీలావతి గారిచే తెలుగులోనికి అనువాదింపబడి ప్రముఖ కన్నడ వాగ్గేయకారుడు ”భక్త కనకదాసు”, మహాభారతం ఉద్యోగపర్వంలోని శ్రీకృష్ణరాయబారం అను కథాంశానికి శ్రీవిద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు వ్యాఖ్యానాన్ని అందించగా డా|| కడిమిళ్ళ వరప్రసాద్‌ వ్రాసిన ”శ్రీకృష్ణరాయబారం”అనే పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీమతి సుధానారాయణమూర్తి,శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.