BRAHMOTSAVAM WORKS TO COMPLETE BY AUGUST END-TTD EO_ అంగరంగ వైభవంగా శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మూెత్సవాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 31 July 2018: All the civil and electrical works will be completed by the end of August for the ensuing twin brahmotsavams, said, TTD EO Sri Anil Kumar Singhal.

A two-hour long review meeting on brahmotsvams 2018 preparatory works took place at Annamaiah Bhavan on Tuesday. District Collector Sri Pradyumna and Tirupati Urban SP Sri Abhishek Mohanty also participated in the high level meeting.

Later speaking to media persons, TTD EO said, the civil and electrical works taken up for brahmotsavams will be completed by August 31.

Excerpts from the press meet:

* Srivari Salakatla Brahmotsavams is slated to take place from September 13 to 21. Important days includes Dhwajarohanam on September 13, Garuda Seva on September 17, Swarnaratham on September 18, Rathotsavam on September 20, Chakrasnanam and Dhwajavarohanam on September 21.

* Honourable Chief Minister Sri N Chandrababu Naidu to present silk vastrams on behalf of State Government on September 13.

* Navarathri Brahmotsavams from October 10 to 18 with important days including Garuda Seva on October 14, Swarna Ratham on October 17 and Chakrasnanam onOctober 18.

* After consulting Agama Advisors, temple priests, Tirumala Jiyar Swami’s, the change in vahana seva timings will be implemented this year. Morning Vahana sevas will be observed between 9am and 11am, Evening Vahana sevas between 8pm and 10pm and Garuda Seva from 7pmand 12 midnight.

* Wide publicity on brahmotsavams through SVBC, other channels, print media, pamphlets, posters etc.will be taken up.

* All privilege darshans will be cancelled during the festival days as in previous years.

* No Break darshan even to protocol VIPs on Garuda Seva days during two brahmotsavams.

* Cultural troupes from across eight to ten states of the country are being anticipated during brahmotsavams.

* Enhanced security arrangements in coordination between TTD vigilance and Police. Scouts and Guides, Srivari Sevakulu services to be utilized to man pilgrim crowd and food, water distribution and other services.

* Additional buses will be run by APSRTC.

* 12 Ambulances to be deployed during the mega event.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, Tirupati JEO Sri P Bhaskar and other senior officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అంగరంగ వైభవంగా శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మూెత్సవాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, 31 జూలై 2018: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మూెత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్‌ శ్రీపిఎస్‌.ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్‌ ఎస్పీ శ్రీ అభిషేక్‌మహంతితో కలిసి ఈవో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో ముఖ్యంగా సెప్టెంబరు 17న గరుడవాహనం, సెప్టెంబరు 18న స్వర్ణరథం, సెప్టెంబరు 20న రథోత్సవం, సెప్టెంబరు 21న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నవరాత్రి బ్రహ్మూెత్సవాల్లో ముఖ్యంగా అక్టోబరు 14న గరుడవాహనం, అక్టోబరు 17న స్వర్ణరథం, అక్టోబరు 18న చక్రస్నానం నిర్వహించనున్నట్లు వివరించారు.

సెప్టెంబరు 13న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఎలాంటి రాజీకి తావులేకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. సెప్టెంబరు 13న ధ్వజారోహణం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ||శ్రీ నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు.

శ్రీవారి వాహనసేవలలో మార్పు

ఈ ఏడాది నుండి భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు సాయంత్రం వాహనసేవలను రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గరుడసేవనాడు మాత్రం రాత్రి 7.00 నుండి అర్ధ్రరాత్రి 12.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలియచేశారు. బ్రహ్మూెత్సవాల సమయంలో 7 లక్షల లడ్డూలను రిజర్వ్‌లో ఉంచుకుంటామన్నారు. భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీవారి మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్ల కోసం ఇప్పటివరకు రూ.4.5 కోట్లు కేటాయించామని, దశలవారీగా ప్రణాళికాబద్ధంగా ఈ పనులను ఆగస్టు నెల చివరినాటికిపూర్తి చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మూెత్సవాలలో వాహనసేవలు వీక్షించే భక్తులకు 510 మరుగుదొడ్లు అందుబాటులోనికి వస్తాయని, ఇందుకోసం అదనంగా 700 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నట్లు తెలిపారు.

గరుడసేవనాడు ద్విచక్రవాహనాలు నిషేధం

గరుడసేవనాడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనుమ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేశామని ఈవో తెలిపారు. తిరుమలలో వివిధ ప్రాంతాలలో 6,800 కార్ల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేపట్టామన్నారు. బందోబస్తు, గ్యాలరీల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర ద్వారాలు, అన్నప్రసాదాలు, జలప్రసాదం, రవాణా, వైద్య సౌకర్యాలు, అదనపు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశామని వివరించారు.

బ్రహ్మూెత్సవాలకు నూతన ఆర్‌టిసి బస్సులు

ఈ ఏడాది బ్రహ్మూెత్సవాల సందర్భంగా 165 క్రొత్త బస్సులను ఆర్‌టిసివారు ఏర్పాటు చేస్తున్నారని, గరుడసేవనాడు భక్తులను చేరవేసేందుకు 6500 ట్రిప్పులు తిరిగేలా సంబంధిత అధికారులతో చర్చించినట్లు వివరించారు. బ్రహ్మూెత్సవాలలో భక్తులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు 12 అంబులెన్స్‌లు, పారామెడికల్‌ సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

శ్రీవారిసేవకులతో భక్తులకు అన్నప్రసాదాలు పంపీణి

శ్రీవారి వాహనసేవలు వీక్షించే భక్తులకు గ్యాలరీలో అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ, ఇతర సేవలను అందించేందుకు 3 వేల మంది శ్రీవారిసేవకులు, భక్తుల క్రమబద్దీకరణకు 1300 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలు వినియోగించుకుంటామన్నారు. తిరుపతిలో భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్‌, తాగునీరు, రవాణా, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేస్తామన్నారు. టిటిడి విజిలెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో భక్తులకు కట్టు దిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేస్తున్నాము. బ్రహ్మూెత్సవాల కోసం జిల్లాలోని ఫైర్‌, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి తగినంతమంది సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించుకుంటామని ఈవో తెలిపారు.

వాహనసేవలలో 10 రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు

బ్రహ్మూెత్సవాలలో శ్రీవారి వాహనసేవలలో ప్రత్యేక ఆకర్షణగా దాదాపు 10 రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు శ్రీవారి సేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడవీధులలో 19 ఎల్‌ఈడి స్క్రీన్‌లు, తిరుమలలోని ప్రధాన కూడళ్ళలలో 12 ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలియచేశారు.

గరుడసేవనాడు బ్రేక్‌ దర్శనాలు రద్దు

బ్రహ్మూెత్నవాల సమయంలో ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని, సెప్టెంబరు 17 మరియు అక్టోబరు 14వ తేదీలలో గరుడసేవనాడు బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామన్నారు. అదేవిధంగా రెండు బ్రహ్మూెత్నవాలలో వయో వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసినట్లు వివరించారు.

ఈ సమావేశంలో తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఇన్‌చార్జ్‌ సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ బాలాజి, ఆర్‌టిసి ఆర్‌ఎం శ్రీ చంగళ్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, ఇతర టిటిడి, పోలీసు, జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.