BRAHMOTSAVAMS IN VALMIKIPURAM FROM APRIL 15 TO 24 _ వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ సాలకట్ల బ్రహ్మోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

Tirumala April 12 2013: The Annual Brahmotsavams of Sri Pattabhiramswamy Vari Temple at Valmikipuram of Chittoor district will take place from April 15 to April 24 said TTD EO Sri L.V.Subramanyam.
 
He has released the posters of Brahmotsavams on Friday at Annamayya Bhavan in Tirumala. Speaking on this occasion he said that special programmes such as cultural and spiritual will be organized by TTDs Hindu Dharma Prachara Parishad, Dasa Sahithya Project and Annamacharya Project during Brahmotsavam.
 
TTD is all set to organise these brahmotsavams in a grand manner. As a part of this mega religious fete begins with Dwajarohanam on April 15, Kalyanotsavam and Garuda Seva on April 20, Parveta Utsavam on April 22 and Pushpayagam on April 24 said the EO. 
 
TTD JEO Sri P.Venkatarami Reddy, Spl Officer DPP Sri Raghunath, DyEO Smt Reddamma, AEO Sri Lakshman Naik and others were also present.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ సాలకట్ల బ్రహ్మోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

తిరుపతి, ఏప్రిల్‌  12, 2013: వాల్మికి పురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 15వ తేది నుండి 24వ తేది వరకు జరగనున్న వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవముల పోస్టర్లను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ.సుబ్రహ్మణ్యం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఇ.ఓ.మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి వాల్మికి మహర్షికి దివ్య దర్శన భాగ్యాన్ని కల్గించిన పవిత్ర క్షేత్రం అని చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాలలో పాల్గొని తరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటరామి రెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డమ్మ, ఎ.ఇ.ఓ. లక్ష్మణ్‌ నాయక్‌, సూపరింటెండెంట్‌ దినకర్‌ రాజు మరియు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తేదీ ఉదయం రాత్రి

15-04-2013(సోమవారం) ధ్వజారోహణం గజవాహనం
16-04-2013(మంగళవారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
17-04-2013(బుధవారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం
18-04-2013(గురువారం) సర్వభూపాలవాహనం శేషవాహనం
19-04-2013(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభవాహనం,
మోహినీ అవతారోత్సవం
20-04-2013(శనివారం) తిరుచ్చి ఉత్సవం   కల్యాణోత్సవం, గరుడ వాహనం
21-04-2013(ఆదివారం) రథోత్సవం ధూళి ఉత్సవం
22-04-2013(సోమవారం) తిరుచ్చి ఉత్సవం     అశ్వవాహనం, పార్వేట ఉత్సవం
23-04-2013(మంగళవారం) వసంతోత్సవం , హంస వాహనం,
చక్రస్నానం ధ్వజావరోహణం
24-04-2013(బుధవారం) స్నపన తిరుమంజనం పుష్పయాగం

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.