CALL CENTRE TRAINING PROGRAM HELD AT SVETA_ టిటిడి కాల్‌సెంటర్, సమాచార కేంద్రాల సిబ్బందికి శ్వేతలో శిక్షణ
Tirupati, 1 August 2018: The Fourth Session of the two-day training program for the staff members of TTD Call Centre and May I Help You Counters was held at SVETA Bhavan in Tirupati on Wednesday evening
SVETA Director Sri N Muktheswara Rao elaborated the staffs he said the nature of queries which they usually receive from pilgrims will be of two types. Generic queries which are commonly asked for information. You should have command on each and every aspect of TTD to answer generic questions.
The second type being specific questions. These questions involves the information with respect to specific subject. You could answer such queries only after getting full information from concerned department HoDs”, he added.
Later TTD PRO Dr T Ravi also informed the call centre staffs to have updated information about the amenities that are being provided to pilgrims.
AEO Smt Geetha, TCS Team Head Sri Satya were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి కాల్‌సెంటర్, సమాచార కేంద్రాల సిబ్బందికి శ్వేతలో శిక్షణ
తిరుపతి, 2018 ఆగస్టు 01: టిటిడి ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతిలో గల సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్ సిబ్బందికి శ్వేత భవనంలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ప్రారంభమైంది.
టిటిడి శ్వేత సంచాలకులు శ్రీ ముక్తేశ్వరావు మాట్లాడుతూ టిటిడి కాల్‌సెంటర్ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సమాచారం అందించాలని సిబ్బందిని కోరారు. భక్తులు సాధారణ సమాచారం కోసం, ప్రత్యేక సమాచారం గురించి తెలుసుకునేందుకు ప్రశ్నలు అడుగుతుంటారని వివరించారు. సాధారణ సమాచారం గురించి భక్తులకు తెలపాలంటే టిటిడిలోని అన్ని విభాగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాని సిబ్బందికి సూచించారు. ప్రత్యేక సమాచారం అందించాలంటే ఆయా విభాగాధిపతి నుండి పూర్తి సమాచారం తెలుసుకుని భక్తులకు తెలియచేయాలని సూచించారు. వాట్సాప్, ఈ మెయిల్స్ ద్వారా భక్తులు వ్యక్తం చేస్తున్న సమస్యలు, సందేహాలను నివృత్తి చేయడానికి ఆయా విభాగాల అధికారులు దృష్టికి తీసుకువెళ్ళాలన్నారు.
అనంతరం టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవి ప్రసంగిస్తూ భక్తుల సౌకర్యాలు, సేవలకు సంబంధించి మరింత వేగవంతంగా సమాచారం అందించేందుకు, టిటిడిలో జరుగుతున్న మార్పులపై కాల్‌సెంటర్ సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీమతి గీతా, టిసిఎస్ అధికారి శ్రీ సత్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.