Central Dharmic Advisory Council Meeting  _ హైందవ ధర్మాన్ని విస్తృత‌ప‌రిచేందుకు కార్యాచరణ ప్రణాళిక  : కార్యనిర్వహణ అధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు 

Tirumala, November 6:  As action plan is being prepared to spread the Hindu  Dharma into grassroot level told Sri I.Y.R. Krishna Rao, Executive Officer, TTDs on Friday. He attended the Central Dharmic Council Meeting held at Annamaiah Bhavan, Tirumala on Friday.

Speaking with media on this occasion, he said that mandal-level Dharmic councils, village level bhajana mandals would be formed soon as to spread bhajan culture as well as cultural activities. He said that the TTD wings such as Publications, Annamacharya project, Dasa Sahithya Project, Hindu Dharma Prachara Parishad along with S.V.B.C will be motivated to formulise an action plan in this regard. He further said that arrangements are on for the smooth conduct of Sanathana Dharma Parchara Sadassu at Tirumala on November 23, 2009.

Sri P.V.R.K.Prasad, Chairman Central Dharmic Advisory Council and members like Sri Atluri Subba Rao, Sri Murali Krishnama Raju, Prof. Ravva Srihari, Sri O.Venkateswarlu, Sri Padala Lakshmikantham, Sreshti, Sri Konjeti Subba Rao, Sri Kavitha Prasad, Secretary DPP, Dr. N.Yuvaraj, Joint Executive Officer and others have participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హైందవ ధర్మాన్ని విస్తృత‌ప‌రిచేందుకు కార్యాచరణ ప్రణాళిక  : కార్యనిర్వహణ అధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు

తిరుపతి, నవంబర్‌-06,2009: హైందవ ధర్మాన్ని గ్రామస్థాయిలో భాగా విస్రుృత పరచడానికి గాను ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేయడం జరుగుతుందని తితిదే కార్యనిర్వహణ అధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు తెలిపారు.

శుక్రవారం సాయంత్రం స్థానిక అన్నమయ్య భవనంలో నిర్వహించిన కేంద్రీయ ధార్మిక సలహామండలి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్ళలో హైందవ ధర్మ వ్యాప్తికి ధార్మిక సలహామండలి చేసిన తీర్మాణాలు, వాటి అమలు విధానాలపై కూలంకశంగా ఈసమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పారు.

రాష్ట్రంలో గ్రామ గ్రామాన ఒక ధార్మిక విప్లవం తీసుకురావడానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌, హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టులు, ప్రచురణల విభాగాల ద్వారా ముమ్మరంగా ధార్మిక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలలో, మండలాల్లో ధార్మిక సలహా మండల్లు ఏర్పాటు చేసి, గ్రామాలల్లో భజనమండల్లు ఏర్పాటుచేసి వారికి ధార్మిక  ప్రచార సామాగ్రిని ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఈనెల 23వ తారీఖున తిరుమలలో నిర్వహించనున్న సనాతన ధర్మప్రచార సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా జిల్లా ధార్మిక సలహా మండళ్ళకు ధర్మ ప్రచారానికి గాను ఒక్కొక్క జిల్లాకు 2 లక్షలు చొప్పున గ్రాంటు ఇవ్వడం జరిగిందని దానిని మరికొంత పెంచడానికి నిర్ణయం తీసుకొంటున్నట్లు తెలిపారు. దళిత దాసరులను ప్రోత్సహించి వారి ద్వారా గ్రామాలలో విసుృతమైన ధార్మిక ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నట్లు ఇఓ తెలిపారు. అంతేకాక ఆయా జిల్లాలలో తితిదే నిర్వహించే కార్యక్రమాల్లో స్వామీజీలను ఆహ్వానించి వారిచేత అనుగ్రహ భాషనం ఇప్పించాలని ఆయన ధర్మప్రచార పరిషత్‌ అధికారులను కోరారు.

ఈకార్యక్రమంలో కేంద్రీయ ధార్మిక సలహా మండలి అధ్యకక్షులు శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌, తిరుపతి జె.ఇ.ఓ డా. యన్‌.యువరాజ్‌, సభ్యులు శ్రీ అట్లూరి సుబ్బారావు, శ్రీ మురళీకృష్ణమరాజు, ఆచార్య రవ్వా శ్రీహరి, శ్రీ ఓ.వెంకటేశ్వర్లు, శ్రీ పి.లక్ష్మీకాంతంశ్రేష్ఠి, శ్రీ కొనిజేటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.