CLARIFICATION ON MAHADWARAM ENTRY FOR PEETHADHIPATIS_ వివరణ
Tirumala, 13 Mar. 19: A report which appeared in a vernacular daily on Wednesday stating about changes in Mahadwaram entry to Peethadhipatis of Mutts is totally baseless.
Tirumala JEO Sri KS Sreenivasa Raju has clarified that there was no change in the regulations regarding the Srivari Temple traditions of Mahadwaram entry for Peethadhipatis of Mutts.
He stated that it’s latest proceedings specified that once in a year five persons were given entry through Mahadwaram to Peethadhipatis. However during rest of the year as per traditions of Srivari the temple, the Peethadhipatis are given entry from the Mahadwaram along with one person only.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వివరణ
మార్చి 13, తిరుమల, 2019: 13.03.2019న తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి ఒక దినపత్రికలో ప్రచురించిన వార్తలో వాస్తవం లేదు.
మఠాధిపతులకు, పీఠాధిపతులకు శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశ నియమాలలో ఎలాంటి మార్పు లేదు.
ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులే కాకుండా ఇంకా ఎవరెవరు రావచ్చని తెలిపేదే సదరు ప్రభుత్వ ఉత్తర్వు.
ఆలయ మర్యాదలు పొందే మఠాధిపతులకు, పీఠాధిపతులకు సంవత్సరానికి ఒకసారి వారితో పాటు ఐదుగురికి మహాద్వార ప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా వారితో పాటు ఒక సహాయకునికి మహాద్వార ప్రవేశం ఉంటుంది.
ఈ మేరకు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.