MANAGEMENT QUOTA ALLOTMENTS IN TTD COLLEGES BEGINS FROM JULY 16-20_ టిటిడి కళాశాలల్లో ప్రవేశాలకు మేనేజిమెంట్ కోటా పూర్తి
Tirupati, 15 July 2019: The allotment of seats under management quota in TTD educational institutions will commence from July 16 to July 20.
The TTD Education Officer in a statement said that selection of applications for seats of academic year 2019-20 in Sri Padmavathi Junior College, Sri Venkateswara Junior College, Sri Padmavathi Degree College, Sri Venkateswara Arts College and Sri Govindarajaswamy Arts College were completed.
He said all selected students will be informed through SMS on their registered mobile numbers by evening of July 15.
All such selected students should report to their designated Colleges with original certificates like TC, Marks cards, Caste and income certificates from July 16- July 20, without fail.
The DEO said in case they fail to report by evening of July 20th then their seat allotment will stand cancelled and thereafter along with other vacant seats, if any, the College will have the right to make spot admissions for desiring local students from July 22nd onwards.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి కళాశాలల్లో ప్రవేశాలకు మేనేజిమెంట్ కోటా పూర్తి
జూలై 15, తిరుపతి, 2019: తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల మరియు శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలలో 2019-20 విద్యా సంవత్సరములో మేనేజిమెంట్ కోటా క్రింద ప్రవేశముల కొరకు అందిన దరఖాస్తులు/విజ్ఞప్తులను పరిశీలించి అర్హులైన విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేయడము పూర్తి అయినది. ఎంపిక చేయబడ్డ విద్యార్థినీ విద్యార్థులకు వారి చరవాణికి సదరు సమాచారమును ఈరోజు (15-07-2019) సాయంత్రములోగా పంపించడము జరుగుతుంది.
పై విదముగా సమాచారము అందుకున్న విద్యార్థినీ విద్యార్థులు రేపటి నుండి అనగా 16-07-2019 నుండి 20-07-2019 లోగా వారి ఒరిజనల్ టి.సి., మరియు మార్కుల జాబితా, కులము, ఆదాయము మొదలైన ధృవీకరణ పత్రములతో వారికి సీటు కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయవలయును. 20-07-2019 సాయంత్రము లోగా రిపోర్టు చేయనట్లయితే వారికి కేటాయించిన సీటు రద్దు అవుతుంది.
కళాశాలలలో ఇంకా మిగిలివున్న సీట్లను తేదీ 22-07-2019 ఉదయము నుండి స్పాట్ అడ్మిషన్ పద్దతిన స్థానికులయిన విద్యార్థినీ విద్యార్థులతో నింపడము జరుగుతుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.