COMPUTER ENGINEERING DIPLOMA COURSES AT SP MAHILA POLYTECHNIC _ శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా కంప్యూటర్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సు

Tirupati, 05 August 2023:  Sri Padmavati Mahila Polytechnic Institute of TTDplans to launch a Computer Engineering Diploma course in this academic year.

Interested students should opt during the polyCET counselling for the DCME course.

The students could opt for DCME in college code SPWT in the counselling besides DECE ( diploma in electronics and communication engineering) and DCCP( diploma in commercial and computer practice  ) courses during polyCET counselling.

TTD said in a statement on Saturday that fees will be as prescribed by government and hostel facility is also available.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా కంప్యూటర్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సు

తిరుపతి, 2023 ఆగస్టు 05: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నూతనంగా కంప్యూటర్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సు ప్రారంభమైంది.

ఈ కోర్సులో చేరదలుచుకున్న విద్యార్థులు పాలిసెట్ కౌన్సిలింగ్ లో డిసిఎంఈ(DCME) కోర్స్ ఆప్షన్ ను ఎంచుకోవాల్సిందిగా కోరడమైనది. కాలేజీ కోడ్ : SPWT, కోర్సు కోడ్ : DCME. అదేవిధంగా, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(DECE), డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్(DCCP) కోర్సులను కూడా పాలీసెట్ కౌన్సిలింగ్ లో ఆప్షన్ గా ఎంచుకోగలరు. ఈ కోర్సులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే ఉంటుంది. విద్యార్థినులకు ఉచితంగా హాస్టల్ సదుపాయం ఉంది. ఈ అవకాశాన్ని విద్యార్థినులు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.