CULTURAL FEAST TO DEVOTEES _ శ్రీవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

TIRUMALA, 02 OCTOBER 2022:The devotees along with Vahana Sevas are spell bound by the magic being casted by various cultural teams performing before vahana sevas every day.

Besides the Harikatha, Bhakti Sangeet, Vishnu Sahasranama Parayanam in Nada Neerajanam and Asthana Mandapam are remaining as added attractions.

IN TIRUPATI

On the other hand, the devotional cultural programmes including Bharatanatyam, Annamayya Sankeertans at Mahati, Ramachandra Pushkarini and Annamacharya Kalamandiram have been immensely attracting the denizens.

 

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

తిరుమల, 2022 అక్టోబ‌రు 02 ;శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో ఆదివారం తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య‌ కళాశాలకు చెందిన శ్రీ హ‌రిబాబు బృందం మంగళధ్వని కార్య‌క్ర‌మం జరిగింది. తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి సునంద‌ బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు శ్రీ రాఘ‌వేంద్ర బృందంబృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీమ‌తి బుల్లెమ్మ‌ అన్న‌మ‌య్య విన్న‌పాలు సంగీత కార్య‌క్ర‌మం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ క‌ళాకారులు శ్రీ రాముడు బృందం హరికథ పారాయణం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది