CULTURAL PAGEANT AT BRAHMOTSAVAMS_ శ్రీవారి వాహనసేవల్లో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న కళాప్రదర్శనలు
Tirumala, 18 September 2018: Cultural activities including bhajans, kolatam, dance, mythological characters display, sankeertans and religious discourses thrilled and regaled the thousands of devotees that thronged the nine day festival of Annual Brahmotsavam at Tirumala since September 13.
As part of the events the 120 member team of Maharashtra Sri Vittal Bhajanmandali enthralled the devotees with their rhythmic drum beating.
The artists of 5 years to 15years age of this troupe who also performed at the Sri Padmavati ammavari Brahmotsavam enthralled the devotees at Tirumala with their performance. Bhajan Mandali of Anantapur spellbound the devotees with their Kolatas and janapada dances. The spoorti Cultural trust from Bangalore with 50 men and women artists displayed drum beats, dances, bhakti sankeertans etc. Similarly the 30 women artists of the Sri Sitaramanjaneya bhajan mandali of Hyderabad participated in Brahmotsavam cultural activities.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీవారి వాహనసేవల్లో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న కళాప్రదర్శనలు
తిరుమల, 18 సెప్టెంబరు 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజు స్వామివారి వాహనసేవల ముందు వివిధ రాష్టాలకు కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇందులో భాగంగా మహారాష్ట్ర ఉస్మానాబాదుకు చెందిన ” శ్రీ విఠల భజన మండలి”కి చెందిన 120 మంది కళాకారుల బృందం మృదంగం, తాళాలను లయబద్ధంగా వాయిస్తూ భక్తులను తన్మయులను చేస్తున్నారు. ఇందులో 5 సం|| నుండి 15 సం||ల మధ్య వయస్సు ఉన్న కళాకారులు ఉన్నారు. వీరు గత 23 సం|| లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలోను భజన మండలి కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు.
అనంతపురానికి చెందిన ”శ్రీకృష్ణ భజన మండలి”కి చెందిన 25 మంది మహిళా కళాకారులు కోలాటాలు, జానపద నృత్యాలు ప్రదర్శిస్తున్నారు. వారు గత 20 సం|| లుగా శ్రీవారి వాహన సేవలలో పాల్గొంటున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన ”స్ఫూర్తి కల్చరల్ ట్రూప్”కు చెందిన 50 మంది మహిళ, పురుష కళాకారులు మొదటి సారిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో జానపద కళాఖండాలు ప్రదర్శించారు. ఇందులో మహిళల డప్పు, పాట కుణిత, పూజ కుణిత భక్తులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా హైదరాబాదుకు చెందిన ”శ్రీ సీతారామాంజనేయ భజన మండలి”కి చెందిన 30 మంది మహిళా కళాకారుల బృందం మొదటి సారిగా శ్రీవారి వాహనసేవలో కోలాటాలు, భజనలు ప్రదర్శించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.