CULTURAL PROGRAMMES ATTRACTS DENIZENS _ ఆకట్టుకున్న ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

Tirupati, 14 September 2018: The cultural programmes organised by SV college of music and dance, HDPP wings of TTD have been attracting denizens in Tirupati.

The brahmotsavams special musical fiesta is capturing the hearts of music lovers.

Smt. Vasudha Ravi from Chennai enthralled the audience with her devotional numbers in Mahati while Sri Balarka troupe from Nellore mused the music lovers at Annamacharya Kalamandiram. Delhi Sisters, Kum.S.Sailaja and Kum.S.Soundarya mesmerised the Tirupatites with their vocal skills in Ramachandra Pushkarini on Friday evening.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆకట్టుకున్న ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

సెప్టెంబరు 14, తిరుపతి 2018 ;శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా శుక్రవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి వసుధ రవి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు నెల్లూరుకు చెందిన శ్రీ జె.బాలార్క బృందం భక్తి సంగీతం వినిపించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఢిల్లీ సిస్టర్స్‌ కుమారి ఎస్‌.శైలజ, కుమారి సౌందర్య బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.