CULTURAL PROGRAMMES IN TIRUPATI IMPRESS DENIZENS తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ – కన్నులపండుగగా సాగిన కూచిపుడి, భరతనాట్యం

Tirupati, 7 Oct. 19 ; The series of devotional dance and music organised by TTD in Tirupati in connection with the ongoing annual brahmotsavams at Tirumala enthralled the denizens on Monday.

The Kuchipudi dance performed by Dr Surabhi Lakshmi Sarada from Hyderabad based Surabhi Academy of Fine Arts mused the art lovers at Annamacharya Kalamandiram. She presented a dance drama “Brahmandanayakuni Brahmotsavam” with her troupe of artistes. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ –  కన్నులపండుగగా సాగిన కూచిపుడి, భరతనాట్యం

తిరుప‌తి, 2019 అక్టోబరు 07 ;  శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుప‌తిలో సోమ‌వారం టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.

 ఇందులో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన సురభి అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్  డా।।సురభి లక్ష్మిశారద బృందం వారు కూచిపుడి సంప్రదాయంలో  చేసిన నృత్యరూపక  కార్యక్రమం సభను సమ్మోహపరచింది. వీరు నర్తించిన నృత్యరూపకం “బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం” కళ్ళకు కట్టినటట్లు సభలోని భక్తసదస్యులను స్వామివారి చెంతకు కొనిపోయినది.
     
ఈ నృత్యరూపకంలో స్వామివారు నిత్యసేవలు, వాహనసేవలు అన్నమాచార్య కీర్తనమాధ్యమంగా సాగింది. ఇందులో ప్రధాన నర్తకీమణులు డా।।సురభి లక్ష్మిశారద, కుమారి కవిత. రూపకప్రధాన పాత్రధారులు- శ్రీవేంకటేశ్వరుడుగా శ్రీహర్షిత, పద్మావతీదేవిగా హన్సిక, పురోహితునిగా వశిష్ఠ అనురాగ్ లు వహించగా, వీరికి బేబి లక్ష్మిప్రసన్న, సిరివెన్నెల, హాసిని, వైష్ణవి, లహరి మొదలైనవారు సహనర్తకీమణులు పాల్గొన్నారు.
   
ఈ కార్యక్రమసమన్వయనం అన్నమాచార్యప్రాజెక్టుకు చెందిన శ్రీమతి తేజోవతి నిర్వహించగా, సప్తగిరి మాసపత్రిక ఉపసంపాదకురాలు డా. అల్లాడి సంధ్య ఇతర భక్తులు పాల్గొన్నారు.
     
అదేవిధంగా తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు బెంగుళూరుకు చెందిన గురు రాఘ‌వేంద్ర య‌క్ష క‌ళా బృందం య‌క్ష‌గానం ప్ర‌ద‌ర్శించింది.

రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ వి.సురేష్‌బాబు బృందం భ‌క్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.