CVSO REVIEWS CCTV CAMERA INSTALLATIONS_ సిసిటివి కెమెరాల ఏర్పాటుపై సివిఎస్‌వో సమీక్ష

Tirumala, 7 February 2018: TTD CVSO Sri Ake Ravikrishna today reviewed the functioning of the CCTV cameras of Tirumala at the Common command centre.

Speaking on the ocassion CVSO said that 1494 CCTV cameras will be installed all over Tirumala with a view to provide fool proof security for devotees. In the first phase 280 CC cameras were being installed in the hi-security zone of Srivari temple and the four Mada streets. The entire networking of CC cameras was taken up on a war footing with the coordinated efforts of National small industries Corporation and TTD engineering officials,he said.

Among others NSSIC general manager Sri Srinivas, VSO Sri Ravindra Reddy, EE Sri Prasad, DE Electrical Smt Saraswati and AVSOs Sri Chiranjeevulu and Sri Ramachandraiah participated in the review meeting.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సిసిటివి కెమెరాల ఏర్పాటుపై సివిఎస్‌వో సమీక్ష

ఫిబ్రవరి 07, తిరుమల, 2018: తిరుమలలో సిసిటివి కెమెరాల ఏర్పాటుపై టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ బుధవారం పిఏసి-4లోని కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ తిరుమలలో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేయడంలో భాగంగా మొత్తం 1494 సిసిటివి కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. మొదటి దశలో హై సెక్యూరిటీ జోన్‌ అయిన శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో 280 సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌ఐసి) అధికారులు, టిటిడి ఇంజినీరింగ్‌ అధికారుల సహకారంతో త్వరితగతిన ఈ పనులను పూర్తి చేస్తామని తెలియజేశారు.

ఈ సమావేశంలో ఎన్‌ఎస్‌ఐసి జనరల్‌ మేనేజర్‌ శ్రీ శ్రీనివాస్‌, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఇఇలు శ్రీ ప్రసాద్‌, శ్రీమతి సరస్వతి, ఎవిఎస్‌వోలు శ్రీ చిరంజీవులు, శ్రీ రామచంద్రయ్య పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.