TIRUMALA TEMPLE DOORS OPENS AFTER LUNAR ECLIPSE _ శ్రీవారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు దర్శనం
Tirumala, 17 Jul. 19: The doors of Tirumala temple re-opened at 5am on Wednesday, after being closed following complete Lunar Eclipse.
After performing Suddhi, Punyahavachanam, Anivara Asthanam was performed between 7am and 9am at Bangaru Vakili. From 11am onwards, the devotees were allowed for darshan of Lord Venkateswara.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు దర్శనం
తిరుమల, 2019 జూలై 17: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం 11.00 గంటల నుండి సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. జూలై 17వ తేదీ చంద్రగ్రహణం కారణంగా జూలై 16న రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే.
బుధవారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.