DASA SAHITYA ARTISTS ALLURE PILGRIMS -SO _ క‌ళాబృందాల్లో యువ‌త‌కు ప్రాధాన్య‌త‌ : దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు

Tirumala, 5 Oct. 19: The Special Officer of Dasa Sahitya Project of TTD,  Dr P Anandatheerthacharyulu said,  the performances by eminent artistes of Dasa Sahitya Project of TTD is been attracting pilgrims during the ongoing brahmotsavams everyday. 

Speaking to media at Media Centre on Saturday,  the SO said,  every day seven teams are performing.  “To provide an opportunity to every team,  we have given a chance to perform on two days.  So that more teams will be covered”,  he added. 

He also said teams from AP,  TS,  TN,  Karnataka,  Kerala, Maharashtra and Puducherry have been performing during the annual mega fete. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

క‌ళాబృందాల్లో యువ‌త‌కు ప్రాధాన్య‌త‌ : దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు

 అక్టోబరు 05, తిరుమ‌ల‌, 2019: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల‌కు విచ్చేసిన క‌ళాబృందాల్లో యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇచ్చామ‌ని, అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నార‌ని టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా – 2లో గ‌ల మీడియా సెంటర్‌లో శ‌నివారం ఆయ‌న మీడియా సమావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ త‌మ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల‌తో నుండి క‌ళాబృందాలు విచ్చేసి బ్ర‌హ్మోత్స‌వాల 9 రోజుల పాటు ప్ర‌ద‌ర్శ‌న‌లిస్తున్నాయ‌ని తెలిపారు. ఆయా రాష్ట్రాల సాంస్కృతిక శాఖ సిఫార్సు చేసిన వాటితోపాటు పేరెన్నికగ‌న్న బృందాల‌ను ఎంపిక చేశామ‌న్నారు. యువ‌తీ యువ‌కులు ఆయా రాష్ట్రాల సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తూ కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం, కోలాటం, డోలు, దేవ‌తామూర్తుల వేష‌ధార‌ణ త‌దిత‌ర క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వివ‌రించారు. స్థానిక క‌ళాకారులు త‌మ‌ను సంప్ర‌దిస్తే త‌ప్ప‌కుండా అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు.

ఈ మీడియా స‌మావేశంలో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

టిటిడి  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.