DEO INSPECTS SV SANSKRIT COLLEGE _ సికింద్రాబాద్ లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలను పరిశీలించిన డిఈఓ

Tirupati, 11 February 2022: TTD Devasthanams Education Officer (DEO) Sri Govindarajan on Friday inspected Sri Venkateswara Vedanta Vardhini Sanskrit Pathashala and College at Secunderabad.

He went around the classrooms, kitchen, store room, computer room and store room and also exhorted the teachers to improve the standards of education.

Among others, he asked them to give special attention on cleaning, quality of vegetables and food items and ensure against any shortness and monitor regular purchases etc.

He expressed happiness over quality of food given to students as well.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సికింద్రాబాద్ లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలను పరిశీలించిన డిఈఓ

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 11: టిటిడి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత పాఠశాల మరియు కళాశాలను శుక్రవారం టిటిడి డిఈఓ శ్రీ గోవిందరాజన్ పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలలోని తరగతి గదులు, వంటశాల, స్టోర్ రూమ్, కంప్యూటర్ రూమ్ ను తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అధ్యాపకులను కోరారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కూరగాయల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని, వంట సరుకులు కొరత రాకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక్కడ 6 నుండి 10వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఉచితంగా భోజనం, వసతి కల్పించడం జరుగుతోంది. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కలిసి 30 మంది విధులు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమంత్ కుమార్, టిటిడి పిఆర్ఓ డాక్టర్ టి.రవి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.