DEVOTEES THRILLED BY SPIRITUAL, CULTURAL AND DHARMIC PROGRAMS DURING SRIVARI BRAHMOTSAVAM _ భ‌క్తుల‌కు విశేషంగా ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

Tirumala, 14 October 2021: TTD is organising daily dharmic and cultural programs at Nada Niranjanam platform and Vasantha Mandapam during the ongoing Srivari annual Brahmotsavam.

Following are details of devotee friendly programs held on Thursday, the penultimate day:

 AT NADA NIRAJANAM PLATFORM

 SRI VISHNU SHASRANAMA STOTRA PARAYANAMS

The cultural team of Bharathiya vidya Bhavan presented Sri Vishnu Sahasranama Stotra parayanams in the morning between 09.00-9.45.

DHARMIC DISCOURSE

 The TTD Dasa Sahitya project OSD Sri PR Ananda Thirtha Charyulu presented a lecture on Dasa Bhakti.

HARIKATHA

The Bhagavatarini Smt Muni Lakshmi and team of TTD Annamacharya project presented a Harikatha parayanams in the afternoon.

ANNAMAIAH SANKEERTAN LAHARI

The Smt Amukktamalyada Sushma troupe of Tirupati presented Annamaiah sankeetans under banner Annamaiah Sankeetan Lahiri.

AT VASANTHA MANDAPAM

The dharmic discourses on Venkatachala Mahatyam and Vahana sevas touched 9 Th day.

Dr Akella Vibhishana Sharma, Director of Annamacharya project presented a, discourse on Venkatachala Mahatyam .He also narrated the significance of Aswa vahana event and Friday’s chakrasnanam. Thereafter aided by 12 TTD Veda pundits devotees performed parayanams of some shlokas of Venkatachala Mahatyam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

భ‌క్తుల‌కు విశేషంగా ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

తిరుమల, 2021 అక్టోబరు 14: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై, వ‌సంత మండ‌పంలో ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో 8వ‌ రోజు గురువారం జ‌రిగిన కార్య‌క్ర‌మాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

శ్రీ విష్ణు స‌హ‌స్ర‌నామ స్తోత్ర పారాయ‌ణం

తిరుప‌తికి చెందిన భార‌తీయ విద్యాభ‌వ‌న్ క‌ళాబృందం స‌భ్యులు ఉద‌యం 9 నుండి 9.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ విష్ణు స‌హ‌స్ర‌నామ స్తోత్ర పారాయ‌ణం చేశారు.

ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నం

టిటిడి దాస‌ సాహిత్య ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి శ్రీ పి ఆర్ ఆనంద తీర్థచార్యులు ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ” దాస భ‌క్తి ” అనే సందేశం అంశంపై ఉప‌న్య‌సించారు.

హ‌రిక‌థ‌

టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు భాగ‌వ‌తారిణి శ్రీమ‌తి మునిల‌క్ష్మి బృందం మ‌ధ్యాహ్నం 2 నుండి 3.15 గంట‌ల వ‌ర‌కు హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.

అన్న‌మ‌య్య సంకీర్త‌న ల‌హ‌రి

తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి ఆముక్త‌మాల్య‌ద సుష్మ‌ బృందం మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న ల‌హ‌రి పేరిట ప‌లు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ల‌య‌బ‌ద్ధంగా ఆల‌పించారు.

వ‌సంత మండ‌పంలో ….

వ‌సంత మండ‌పంలో నిర్వ‌హిస్తున్న‌వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం, వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై ఉప‌న్యాస కార్య‌క్ర‌మం గురువారం 9వ‌ రోజుకు చేరుకుంది.

ఇందులో భాగంగా అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ వేంక‌టాచ‌ల మ‌హ‌త్యంపై ఉప‌న్య‌సించారు. అనంత‌రం గురువారం రాత్రి శ్రీ‌వారికి జ‌రిగే అశ్వ‌ వాహనం, ఆదివారం ఉద‌యం జ‌రిగే చ‌క్ర‌స్నానం వైశిష్ట్యాన్ని క‌మ‌నీయంగా వ్యాఖ్యానించారు. చివ‌రగా వేంక‌టాచ‌ల మ‌హ‌త్యంలోని స్తోత్రాల‌ను 12 మంది టిటిడి వేద‌పండితులు భ‌క్తుల‌చే పారాయ‌ణం చేయించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.