DEVUNI KADAPA BTUs FROM FEB 5_ ఫిబ్రవరి 5న దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 4 February 2019: The annual brahmotsavams in the famous shrine of Sri Lakshmi Venkateswara Swamy at Devuni Kadapa, in YSR Kadapa district will commence from February 6 with Ankurarpanam on February 5.
The important events includes, Dhwajarohanam on February 6, Garuda Vahanam on February 10, Rathotsavam on February 12 and Chankrasnanam on February 14. There will be Pushpayagam on February 15.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఫిబ్రవరి 5న దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 04 ఫిబ్రవరి 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ మంగళవారం సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

06-02-2019(బుధవారం) ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం

07-02-2019(గురువారం) సూర్యప్రభవాహనం పెద్దశేష వాహనం

08-02-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం సింహవాహనం

09-02-2019(శనివారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

10-02-2019(ఆదివారం) ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం

11-02-2019(సోమవారం) కల్యాణోత్సవం గజవాహనం

12-02-2019(మంగళవారం) రథోత్సవం ధూళి ఉత్సవం

13-02-2019(బుధవారం) సర్వభూపాల వాహనం అశ్వ వాహనం

14-02-2019(గురువారం) వసంతోత్సవం, చక్రస్నానం హంసవాహనం, ధ్వజావరోహణం

15-02-2019(శుక్రవారం) స్నపనతిరుమంజనం పుష్పయాగం

ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి,అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.