శ్రీవారికి ట్రాక్టర్ విరాళం
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారికి ట్రాక్టర్ విరాళం
సెప్టెంబరు 17, తిరుమల 2019: చెన్నైకి చెందిన టఫే సంస్థ ప్రతినిధి శ్రీ పిపి.సంపత్ రూ.6 లక్షల విలువైన ట్రాక్టర్‌ను మంగళవారం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.
ఈ మేరకు ట్రాక్టర్ రికార్డులను, తాళాన్ని తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌కు అందించారు. ముందుగా ఆలయ అర్చకులు వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం డిఐ శ్రీ మోహన్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.