DON’T GET CHEATED BY MIDDLEMEN- TTD VIGILANCE _ దళారులమాటలకు మోసపోవద్దు 

Tirumala, 13 Sep. 20: In spite of repeated appeals by TTD not get cheated by middlemen or fake websites for darshan or job recruitment, some devotees are still falling prey to such dubious activities.

TTD vigilance department once again appealed and cautioned the devotees not to be carried away and cheated by the middlemen on offers of begetting prestigious Seva tickets of Srivari Vastram, Udayasthamana and Abhisekam sevas.

In a statement on Sunday, the TTD vigilance department officials clarified that in view of COVID-19 restrictions tickets for such sevas are not issued at all to anyone.

With regard to all arjita Seva tickets every devotee is advised that they could be procured only through official TTD website www.tirupatibalaji.ap.gov.in 

Such prestigious arjita Seva tickets will be available after the resumption of these services and that too through lucky dip platform after purchasing the tickets.

TTD, again and again, appealing to devotees not to trust the middlemen who make such offers and that TTD will take stringent action against such elements who mislead the devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దళారులమాటలకు మోసపోవద్దు 

తిరుమల. 13 సెప్టెంబర్ 2020: తిరుమల శ్రీవారి వస్త్రం, అభిషేకం, ఉదయాస్తమాన సేవ లాంటి టికెట్లు ఇప్పిస్తామని కొందరు దళారులు భక్తులను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ నిఘా, భద్రత విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ 19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తిరుమలలో ప్రస్తుతం ఎలాంటి ఆర్జిత సేవా టికెట్లు ఇవ్వడం లేదని తెలిపింది. తిరుమలకు సంబంధించిన సేవా టికెట్లు ఎప్పుడైనా టీటీడీ అధికారిక వెబ్సైట్ tirupatibalaji.ap.gov.in ద్వారా మాత్రమే పొందే అవకాశం ఉందని టీటీడీ నిఘా, భద్రత విభాగం వివరించింది.

ఆర్జిత సేవల పునరుద్ధరణ తరువాత ఆన్లైన్ లో సేవా టికెట్లు లభించని భక్తులకు తిరుమలలో లక్కీ డిప్ ద్వారా మాత్రమే టికెట్లు పొందే అవకాశం ఉందన్నారు. భక్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. భక్తులను మోసాగించే దళారుల మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది